PAK vs WI: పాకిస్తాన్‌కు షాక్.. వెస్టిండీస్ పర్యటనలో కరోనా బారిన సీనియర్ ఆటగాడు..!

వెస్టిండీస్ టూర్‌ ముగిసిన అనంతరం లాహోర్‌‌కు బయలుదేరే ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యుడు కోవిడ్ -19 బారిన పడ్డాడు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు.

PAK vs WI: పాకిస్తాన్‌కు షాక్.. వెస్టిండీస్ పర్యటనలో కరోనా బారిన సీనియర్ ఆటగాడు..!
Pakistan Cricket Team
Follow us
Venkata Chari

|

Updated on: Aug 26, 2021 | 9:05 AM

PAK vs WI: పాకిస్తాన్ క్రికెట్ జట్టు వెస్టిండీస్ టూర్‌ ముగిసింది. దీంతో లాహోర్‌కి బయలుదేరే ముందు ఆటీంకు ఓ షాక్ తగిలింది. పాకిస్తాన్ జట్టు సభ్యులందరి కోవిడ్ -19 పరీక్ష చేయగా, ఇందులో జట్టు ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం అతను 10 రోజులు క్వారంటైన్‌లో ఉన్నాడు. జట్టు మొత్తం నెగెటివ్‌గా తేలింది. కోచ్ మినహా మిగిలిన జట్టు షెడ్యూల్ ప్రకారం లాహోర్‌కు బయలుదేరుతుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటనలో, “మిస్బాకు ఎలాంటి లక్షణాలు లేవు. కానీ, పాజిటివ్‌గా తేలింది. దీంతో అతను ప్రస్తుతం 10 రోజుల క్వారంటైన్‌లో ఉంటాడు. ఆ తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించి, నెగిటివ్‌గా తేలితే పాకిస్తాన్ చేరుకుంటాడు. పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఒక టెస్ట్, టీ20 సిరీస్ ఆడింది. ఇవి పూర్తి అయిన తర్వాత ప్రీ-డిపార్చర్ సమయంలో పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. దీనిలో పాజిటివ్‌గా తేలిన ఏకైక సభ్యుడు మిస్బా. షెడ్యూల్ ప్రకారం ఇతర సభ్యులందరూ బుధవారం జమైకాకు వెళ్తారు ” అని బోర్డు ప్రకటించింది.

మరోవైపు ఈ సిరీస్‌లో పాకిస్థాన్ అద్భుతమైన ఆటను ప్రదర్శించింది. రెండవ, చివరి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయడం ద్వారా ఓటమి నుంచి తప్పించుకుంది. తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ టీం పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. ఇక్కడి నుంచి పాకిస్థాన్ సిరీస్ కోల్పోయే ప్రమాదం ఎదుర్కొంది. కానీ, రెండో టెస్ట్ మ్యాచ్‌లో, పాకిస్థాన్ గొప్ప ఆటను ప్రదర్శించి విజయం సాధించింది. సిరీస్‌ను టైతో ముగించింది. టాస్ ఓడిపోయిన తరువాత, పాకిస్తాన్ జట్టు స్కోరు 2 పరుగులకు 3వికెట్లు కోల్పోయింది. దీంతో బాబర్ అజామ్, ఫవాద్ ఆలం జట్టును కష్టాల నుంచి బయట పడేశారు. వీరిద్దరూ మూడో రోజు వరకు పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్‌ను చేపట్టారు. వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడింది. దీని కారణంగా చాలా మంది మ్యాచ్ ఫలితాన్ని ఊహించలేదు. కానీ, పాకిస్తాన్ బౌలర్లు ముఖ్యంగా షహీన్ షా అఫ్రిది 10/94 రెండు ఇన్నింగ్స్‌లలో విండీస్ బ్యాట్స్‌మెన్ వెన్ను విరిచడంతో పాకిస్తాన్ విజయం సాధ్యమైంది.

Also Read: IND vs ENG: “మోచేయి గాయంతో 7 నెలలు క్రికెట్‌కి దూరం.. భారత్‌తో సిరీస్‌ ఆడనందుకు భాదపడుతున్నా” ఇంగ్లండ్ బౌలర్ ఆవేదన

Virat Kohli: ‘సచిన్ సలహాలు తీసుకో.. లేదంటే మరిన్ని పరాభవాలు ఎదురుకావొచ్చు’: విరాట్ కోహ్లీకి సూచించిన భారత మాజీ దిగ్గజం

IND vs ENG: టీమిండియా పేసర్‌పై ప్రేక్షకుల దురుసు ప్రవర్తన..! బంతిని విసరుతూ.. స్కోరు అడుగుతూ విసిగించారు.. దిమ్మతిరిగే సమాధానమిచ్చిన బౌలర్

క్రిమినల్‌ ఆచూకీ చెప్పండి.. పోలీసుల పావలా రివార్డు అందుకోండి..
క్రిమినల్‌ ఆచూకీ చెప్పండి.. పోలీసుల పావలా రివార్డు అందుకోండి..
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు అదనపు విమాన సర్వీసులు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు అదనపు విమాన సర్వీసులు
ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా అనాస తినొద్దు ఎందుకంటే..
ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా అనాస తినొద్దు ఎందుకంటే..
కడప దర్గాను దర్శించుకున్న రామ్ చరణ్..
కడప దర్గాను దర్శించుకున్న రామ్ చరణ్..
విమానంలో సిగరెట్‌ తాగిన ప్రయాణికుడి అరెస్టు
విమానంలో సిగరెట్‌ తాగిన ప్రయాణికుడి అరెస్టు
ఉదయమా.? సాయంత్రమా.? ఏ సమయంలో వాకింగ్ చేస్తే బరువు తగ్గుతారంటే..
ఉదయమా.? సాయంత్రమా.? ఏ సమయంలో వాకింగ్ చేస్తే బరువు తగ్గుతారంటే..
ఇస్రోతో జతకట్టిన ఎలన్ మస్క్.. కారణం తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే
ఇస్రోతో జతకట్టిన ఎలన్ మస్క్.. కారణం తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే
బంగారపు టూత్ బ్రష్‌తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
బంగారపు టూత్ బ్రష్‌తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
హైవేపై రెడ్ కారు రెక్‌లెస్ డ్రైవింగ్.. పోలీసుల ఎంట్రీతో
హైవేపై రెడ్ కారు రెక్‌లెస్ డ్రైవింగ్.. పోలీసుల ఎంట్రీతో
2025లో మహా కుంభమేళా ఎప్పుడు ప్రారంభం.. ఎక్కడ జరగనున్నాయంటే
2025లో మహా కుంభమేళా ఎప్పుడు ప్రారంభం.. ఎక్కడ జరగనున్నాయంటే