IND vs ENG: “మోచేయి గాయంతో 7 నెలలు క్రికెట్‌కి దూరం.. భారత్‌తో సిరీస్ ఆడనందుకు భాదపడుతున్నా” ఇంగ్లండ్ బౌలర్ ఆవేదన
గాయాల కారణంగా జోఫ్రా ఆర్చర్ కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతను మూడు-నాలుగు నెలలుగా మోచేయి గాయం కారణంగా ఇబ్బంది పడుతున్నాడు.
Jofra archer: గాయాల కారణంగా జోఫ్రా ఆర్చర్ కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతను మూడు-నాలుగు నెలలుగా మోచేయి గాయం కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ కారణంగా ఇటీవల భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ నుంచి కూడా జోఫ్రా ఆర్చర్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం దీని గురించి ఆయన ఓ ప్రకటన చేశాడు. ఇంగ్లండ్ తరఫున ఆడిన టిమ్ బ్రెస్నన్‌తో గాయం గురించి మాట్లాడిన జోఫ్రా ఆర్చర్.. అతను 2022 మార్చిలో జరిగే వెస్టిండీస్‌తో సిరీస్ ద్వారా పునరాగమనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మోచేయి గాయం కారణంగా బ్రెస్నన్ తన కెరీర్‌లో చాలా ఇబ్బంది పడ్డాడు. దీనితో అతని కెరీర్ బాగా దెబ్బతింది. అతను 2011 లో టెస్టుల్లో నంబర్ వన్ అయిన ఇంగ్లండ్ జట్టులో ఒక భాగంగా ఉన్నాడు.
జోఫ్రా ఆర్చర్ ఇంగ్లీష్ వార్తాపత్రిక డైలీ మెయిల్ కోసం తన గాయానికి సంబంధించిన అనుభవాల గురించి బ్రెస్నన్‌తో మాట్లాడినట్లు రాశాడు. ఆర్చర్ ప్రకారం, ‘టిమ్ బ్రెస్నన్‌తో ఇలాంటి సమస్య ఉంది. మేము దాని గురించి మాట్లాడాము. ఇది నన్ను భయపెట్టింది. అయితే భవిష్యత్తులో నేను బాగానే ఉంటానని నాకు ఖచ్చితంగా తెలుసు. మంచి పరిణామం ఏమిటంటే గాయం కారణంగా, నా రోజువారీ పనులు ప్రభావితం కాలేదు. నా మోచేతిలో ఫ్రాక్చర్ కారణంగా నేను 2021లో ఆడలేనని తెలుసుకున్నాను. అది నాకు చాలా కష్టమైన సమయం. కానీ, ఏది జరిగినా, అందుకు ఒక కారణం ఉంటుంది. గాయంతో నా కెరీర్ ఆగదని అర్థం చేసుకున్నాను.
ప్రస్తుతం నాకు 26 సంవత్సరాలు మాత్రమే.. ఆర్చర్ తన టెస్ట్ కెరీర్‌ను కొనసాగించడానికి ఎదురు చూస్తున్నానని నొక్కి చెప్పాడు. ‘టెస్ట్ క్రికెట్ నాకు చాలా ముఖ్యమైన ఫార్మాట్ అని నేను చాలాసార్లు చెప్పాను. ఈ విషయంలో ఎలాంటి మార్పులేదు. భారత్‌తో సిరీస్‌కు దూరంగా ఉండటం చాలా కలవరపెడుతుంది. అలాగే, చలికాలంలో ఆస్ట్రేలియా వెళ్లకపోవడం బాధాకరం. నేను ఫ్రాక్చర్‌తో బాధపడుతుంటే, నేను భవిష్యత్తుపై వేరే అభిప్రాయాన్ని కలిగి ఉండవచ్చు. కానీ, ప్రస్తుతానికి నా వయసు 26 సంవత్సరాలు మాత్రమే. టెస్ట్ క్రికెటర్‌గా నా బెస్ట్ ఇయర్స్ ఇంకా రాలేదని నేను భావిస్తున్నాను.
ఈ ఏడాది చివరి వరకు ఆర్చర్ ఎలాంటి క్రికెట్ ఆడలేడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే, ఈ ఆటగాడు మార్చి 2022 వరకు తాను ఆడలేనని చెప్పుకొచ్చాడు. దీంతో రాబోయే ఐపీఎల్, టీ20 ప్రపంచ కప్‌లకు కూడా జోఫ్రా ఆర్చర్ దూరమవ్వనున్నాడు.