AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీ మొండి వైఖరితో పరువు పోతోంది..: పీసీబీ ఛైర్మన్‌కు ఇచ్చిపడేసిన పాక్ మాజీ ప్లేయర్

Wasim Akram Comments: పీసీబీ తన సొంత వైఖరితో అటు ప్రజల నుంచి, ఇటు మాజీ ఆటగాళ్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. భారత జట్టుతో మ్యాచ్‌ను బహిష్కరించడం, అది కూడా బంగ్లాదేశ్ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోడం ఏంటంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

నీ మొండి వైఖరితో పరువు పోతోంది..: పీసీబీ ఛైర్మన్‌కు ఇచ్చిపడేసిన పాక్ మాజీ ప్లేయర్
Wasim Akram Pcb
Venkata Chari
|

Updated on: Feb 04, 2026 | 11:49 AM

Share

Pakistan: పీసీబీ మొండి వైఖరితో అటు ఐసీసీ, ఇటు ప్రపంచ క్రికెట్ కు విఘాతం కలిగించేలా ఉంది. పాకిస్తాన్ నిర్ణయంతో ఓ పక్క విమర్శలు వినిపిస్తున్నా.. రోజుకో వివాదాన్ని తెరపైకి తెస్తూ ఛీవాట్లు తింటోంది. ఈక్రమంలో సొంత దేశంలో మాజీ ఆటగాళ్లు కూడా పీసీబీ ప్రవర్తనపై పెదవి విరుస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మాజీ దిగ్గజ బౌలర్ వసీం అక్రం చేరాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ప్రెసెంట్ మొండి వైఖరిపై వసీం అక్రం తనదైన శైలిలో విరుచుకపడ్డాడు. 2026 టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న నేపథ్యంలో వారికి సంఘీ భావంగా పాక్ కూడా భారత జట్టుతో మ్యాచ్ ను బహిష్కరించాలని చూడటంపై అక్రం తీవ్ర స్థాయిలు అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్ తన ప్రయోజనాలను ఎందుకు ఫణ్ణంగా పెట్టాలని ఆయన సూటిగా ప్రశ్నించాడు.

బంగ్లాదేశ్ ఆడకపోతే పాకిస్తాన్‌కు వచ్చే నష్టం ఏంటి?

అసలు ఈ నిర్ణయంలో మతలబు ఏముందంటూ బోర్డు అధికారుల తీరును ఎండగట్టాడు. కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగాల్సిన హై వోల్టేజ్ భారత్, పాక్ మ్యాచ్ ను బహిష్కరించడం వల్ల ప్రపంచ క్రికెట్ వేదికపై పాకిస్తాన్ ఏకాకిగా మారుతుందని, ఇలాంటి రాజకీయ డ్రామాలు జట్టుకు ఏమాత్రం మేలు చేయవని ఆయన హెచ్చరించాడు. పొరుగు దేశాల అడుగుజాడల్లో నడవటం మానేసి సొంత జట్టు అభివృద్ధిపై దృష్టి సారించాలని పీసీబీకి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు.

ఇది కూడా చదవండి: PCB vs ICC: ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డ్ ఏర్పాటు.. ఆ రెండు దేశాల మద్దతుతో పాక్ దూకుడు..?

పాకిస్తాన్ క్రికెట్ జట్టు వివాదాల కంటే మైదానంలో ఆటగాళ్ళ ప్రదర్శనను మెరుగుపరచడంపై ఫోకస్ పెట్టడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డాడు. మరోవైపు పీసీబీ తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం పాక్ క్రికెట్ భవిష్యత్తును ప్రమాదంలో పడేసేలా ఉందని మాజీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ముందస్తు ఒప్పందాలను ఉల్లంఘిస్తే సదరు బోర్డుపై నిషేధం విధించే అధికారం అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఉంది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో జరగనున్న ఐసీసీ కీలక సమావేశంపై సర్వత్ర ఉత్కంఠ నెలుకుంది.

ఐసీసీ కఠిన చర్యలు తీసుకోకముందే పీసీబీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ ఐసీసీ సమావేశంలో పాకిస్తాన్ జట్టుకు వ్యతిరేఖంగా తీర్పు వస్తే.. కచ్చితంగా బ్యాన్ చేయాల్సి రావొచ్చు. ఇదే జరిగితే, పీసీబీ తలదించుకోవాల్సి వస్తుంది.

ఇది కూడా చదవండి: Team India: అభిషేక్, సూర్య కాదు భయ్యో.. టీ20 ప్రపంచకప్ లో విదేశీ బౌలర్ల పాలిట విలన్‌గా ‘ఛోటా ప్యాకెట్’

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. ఆ వైబ్ వేరెలెవల్..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. ఆ వైబ్ వేరెలెవల్..
ఉసిరికాయ పచ్చడి ఇలా చేసుకుని తింటే.. మటన్, చికెన్ కూడా సరిపోవు!
ఉసిరికాయ పచ్చడి ఇలా చేసుకుని తింటే.. మటన్, చికెన్ కూడా సరిపోవు!
సింహం ముందే కుప్పిగంతులా.! PSLపై బ్యాన్ దిశగా ఐసీసీ అల్టిమేటం..
సింహం ముందే కుప్పిగంతులా.! PSLపై బ్యాన్ దిశగా ఐసీసీ అల్టిమేటం..
మీ ఆధార్‌ను ఎవరైనా తప్పుగా వాడారా..? ఆన్‌లైన్‌లో ఇలా తెలుసుకోండి
మీ ఆధార్‌ను ఎవరైనా తప్పుగా వాడారా..? ఆన్‌లైన్‌లో ఇలా తెలుసుకోండి
పచ్చి అరటి పవర్‌ఫుల్‌ బెనిఫిట్స్‌.. తప్పక తెలుసుకోవాలి!
పచ్చి అరటి పవర్‌ఫుల్‌ బెనిఫిట్స్‌.. తప్పక తెలుసుకోవాలి!
సమతా కుంభ్ బ్రహ్మోత్సవాల్లో అద్భుతం.. కనులపండువగా శాంతి కల్యాణ..
సమతా కుంభ్ బ్రహ్మోత్సవాల్లో అద్భుతం.. కనులపండువగా శాంతి కల్యాణ..
గుర్రం కాదు.. నడిచే సంపద..? విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది గురూ.!
గుర్రం కాదు.. నడిచే సంపద..? విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది గురూ.!
2007 నుంచి 2026 వరకు.. టీ20 ప్రపంచ కప్ హిస్టరీలోనే తొలి ప్లేయర్?
2007 నుంచి 2026 వరకు.. టీ20 ప్రపంచ కప్ హిస్టరీలోనే తొలి ప్లేయర్?
చంద్రహాస్ వరస్ట్ సాంగ్ పై జేడీ చక్రవర్తి రియాక్షన్..
చంద్రహాస్ వరస్ట్ సాంగ్ పై జేడీ చక్రవర్తి రియాక్షన్..
గుట్టుపైకి ఏకాంతంగా లవర్‌తో.. కట్ చేస్తే..
గుట్టుపైకి ఏకాంతంగా లవర్‌తో.. కట్ చేస్తే..