ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ జట్టులో కలకలం.. హీరోయిన్లతో చాటింగ్‌పై దుమారం..!

Shadab Khan Addresses Social Media Controversy: పాకిస్తాన్ క్రికెటర్లు, నటీమణుల మధ్య ప్రేమ వ్యవహారాలపై వివాదం రేగుతోంది. షాదాబ్ ఖాన్ మాట్లాడుతూ, క్రికెటర్లు నటీమణులకు సందేశాలు పంపడంలో తప్పు లేదని, అయితే నటి సమాధానం ఇవ్వకపోతే సంభాషణ ముగిసిపోతుందని పేర్కొన్నాడు. టిక్‌టాకర్ షా తాజ్ ఖాన్, కొంతమంది క్రికెటర్లు తనకు సందేశాలు పంపారని ఆరోపించింది. ఈ విషయంపై పాకిస్తాన్ జట్టులో విభేదాలు లేవని షాదాబ్ ఖాన్ తెలిపాడు.

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ జట్టులో కలకలం.. హీరోయిన్లతో చాటింగ్‌పై దుమారం..!
Pakistan Cricketers Actresses Dating Rumours

Updated on: Jan 29, 2025 | 4:50 PM

Pakistan Cricketers Actresses Dating Rumours: క్రికెటర్లు, నటీమణుల ప్రేమ కథలు ఎలప్పుడూ ముఖ్యాంశాలలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి ప్రేమ కథలు చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి విదాదమే మరోసారి తెరపకి వచ్చింది. క్రికెటర్లు, నటీమణుల మధ్య వినిపిస్తోన్న ఆరోపణలకు సంబంధించి పాకిస్తాన్ క్రికెటర్లు తమ మౌనాన్ని వీడారు. ఒక షోలో, పాకిస్థానీ ఆల్‌రౌండర్‌ ఇదే విషయమై క్లారిటీ ఇచ్చేశాడు. క్రికెటర్లు సోషల్ మీడియాలో నటీమణులు, టిక్‌టాకర్‌లకు సందేశాలు పంపారా లేదా ఇవి నిరాధారమైన వాదనలేనా అంటూ పాకిస్తాన్ ప్లేయర్ షాదాబ్‌ని అడిగారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక క్రికెటర్ నటీమణులకు లేదా టిక్‌టోకర్‌లకు మెసేజ్ చేస్తే తప్పు లేదు. నటికి ఆ మెసేజ్‌లు వచ్చినా, ఆమెకు అవి నచ్చకపోతే, ఆమె ప్రత్యుత్తరం ఇవ్వకూడదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

షాదాబ్ మాట్లాడుతూ- నటి ప్రత్యుత్తరం ఇవ్వకపోతే, ఆమెకు ఇకపై మెసేజ్‌లు రావు. కానీ, ఆమె ప్రత్యుత్తరం ఇస్తే, ఆపై మెసేజ్‌లతో సంభాషణలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే, ఫిర్యాదు చేయడమనేది మాత్రం సరైనది కాదని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్ క్రికెటర్ మాట్లాడుతూ.. కొంతమంది నటీమణులు కీలక వాదనలు చేసే వీడియోలను నేను చూశాను. కానీ, ఇది ఎల్లప్పుడూ అలా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు విషయాలు అతిశయోక్తిగా మారుతుంటాయి. ముఖ్యంగా కీలక క్రికెట్ టోర్నీల సమయంలో పబ్లిసిటీ కోసమే ఇలాంటి ప్రకటనలు చేస్తుంటారు. ఇది దృష్టిని ఆకర్షించడానికి ఒక మార్గం.

కాగా, పాకిస్థాన్ జట్టులో నటి గురించి చర్చపై మాట్లాడుతూ.. ఏ నటికి ఎవరు మెసేజ్ పంపారు అనే విషయంలో టీమ్‌లో గొడవలు లేవని తేల్చి చెప్పాడు.

ఇటీవల, టిక్‌టాకర్ షా తాజ్ ఖాన్ తాను షాదాబ్ ఖాన్‌కు స్నేహితురాలని పేర్కొంది. వారిద్దరూ ఒకరికొకరు సోషల్ మీడియాలో సందేశాలు పంపుకున్నారని, మోమిన్ ఇక్బాల్, నావల్ సయీద్ కూడా తమకు తరచూ సందేశాలు పంపుతున్నారని పేర్కొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..