IND vs PAK: వీడెవడ్రా సామీ.. ట్రోఫీ గెలిచామంటూ విర్రవీగిన పాక్ ప్లేయర్.. ఫ్యాన్స్ దెబ్బకు బుర్ర కరాబ్
Muhammad Shahzad vs Dinesh Karthik: ఇటీవల జరిగిన హాంకాంగ్ సిక్సెస్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించినప్పటికీ, భారత కెప్టెన్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik)పై వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన పాక్ క్రికెటర్ మొహమ్మద్ షాజాద్ (Muhammad Shahzad) కు నెటిజన్ల నుంచి ఊహించని కౌంటర్ ఎదురైంది.

Muhammad Shahzad vs Dinesh Karthik: ఇటీవల జరిగిన హాంకాంగ్ సిక్సెస్ 2025 క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన తర్వాత, భారత్, పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య సోషల్ మీడియాలో జరిగిన సరదా వాగ్వాదం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పాకిస్తాన్ జట్టు విజయం సాధించినప్పటికీ, భారత కెప్టెన్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik)పై వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన పాక్ క్రికెటర్ మొహమ్మద్ షాజాద్ (Muhammad Shahzad) కు నెటిజన్ల నుంచి ఊహించని కౌంటర్ ఎదురైంది.
అసలేం జరిగింది?
హాంకాంగ్ సిక్సెస్‌లో భారత్, పాకిస్తాన్‌లు గ్రూప్ దశలో తలపడ్డాయి. దినేష్ కార్తీక్ నాయకత్వంలోని టీమ్ ఇండియా (వీరిలో చాలామంది మాజీ క్రికెటర్లు, వెటరన్ ఆటగాళ్లు ఉన్నారు) ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను (వీరిలో చాలామంది యువ, యాక్టివ్ పీఎస్ఎల్ ఆటగాళ్లు ఉన్నారు) డీఎల్‌ఎస్ పద్ధతిలో కేవలం రెండు పరుగుల తేడాతో ఓడించింది.
ఈ విజయానంతరం, కార్తీక్ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో, “Fun start to Hong Kong Sixes, Winning against Pak” (పాక్‌పై గెలుపుతో హాంకాంగ్ సిక్సెస్‌లో సరదా మొదలైంది) అని ట్వీట్ చేశాడు.
ఆ తర్వాత, పాకిస్తాన్ జట్టు కువైట్‌ను ఫైనల్‌లో ఓడించి హాంకాంగ్ సిక్సెస్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం తర్వాత, పాకిస్తాన్ జట్టు సభ్యుడు మొహమ్మద్ షాజాద్ వెంటనే కార్తీక్ పాత పోస్ట్‌కు రిప్లై ఇస్తూ, “Fun end to the Hong Kong Sixes, Business as usual” (హాంకాంగ్ సిక్సెస్‌లో సరదా ముగిసింది, మాకు ఇది మామూలే) అని వ్యాఖ్యానించాడు.
దీంతో పాటు, టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా ట్రోఫీతో పోజు ఇచ్చిన ఐకానిక్ సెలబ్రేషన్‌ను కాపీ చేస్తూ షాజాద్ ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశాడు.
నెటిజన్ల నుంచి స్ట్రాంగ్ రియాక్షన్..
Fun end to the Hong Kong Sixes
Business as usual 😉#WeHaveARealTrophy #PAKISTANZINDABAD https://t.co/ftxVenMpDQ pic.twitter.com/IEdvzzVA46
— Muhammad Shahzad (@imshahzad27) November 9, 2025
షాజాద్ “Business as usual” అనే కామెంట్ చేయగానే సోషల్ మీడియాలో అతనికి వ్యతిరేకంగా ట్రోలింగ్ మొదలైంది. భారత జట్టులో దినేష్ కార్తీక్, రాబిన్ ఉతప్ప, స్టువర్ట్ బిన్నీ వంటి వెటరన్, రిటైర్డ్ ఆటగాళ్లు ఉండగా, పాకిస్తాన్ జట్టులో అబ్బాస్ అఫ్రిది, అబ్దుల్ సమద్ వంటి యువ, చురుకైన PSL (పాకిస్తాన్ సూపర్ లీగ్) ఆటగాళ్లు ఉన్నారు. అనుభవజ్ఞుల జట్టుపై చిన్న ట్రోఫీ గెలిచినందుకు అతిగా మాట్లాడటం సరికాదని అభిమానులు గట్టిగా సమాధానం ఇచ్చారు.
So young active PSL and international players Loss against some retired commentators and now they are flexing a jhatu Hong kong sixes trophy against a team that is 2024Wc winner, CT winner, Asia cup winner, WC runner-up beat Pakistan 3-0 in one month 🤡🤡🤣
— M10 (@628472005X) November 9, 2025
పాకిస్తాన్ టోర్నమెంట్‌లో ఛాంపియన్‌గా నిలిచినప్పటికీ, టోర్నీలో ఆ జట్టుకు ఎదురైన ఒకే ఒక్క ఓటమి దినేష్ కార్తీక్ నేతృత్వంలోని టీమ్ ఇండియా చేతిలోనే! తాము ఓడిపోయిన జట్టు కెప్టెన్‌పై విజయం తర్వాత వ్యంగ్యంగా మాట్లాడటం ‘చూయింగ్ గమ్ తిన్న కుక్క’లా ఉందని నెటిజన్లు ఎద్దేవా చేశారు.
చివరగా, హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ టైటిల్ పాకిస్తాన్ గెలిచినప్పటికీ, దినేష్ కార్తీక్ చేసిన ఒకే ఒక్క పోస్ట్‌కు, దానికి షాజాద్ ఇచ్చిన కౌంటర్‌కు వచ్చిన స్పందన చూస్తే.. క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ పోటీని అభిమానులు ఎంత సీరియస్‌గా తీసుకుంటారో మరోసారి స్పష్టమైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
