Babar Azam: ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాక్‌ కెప్టెన్‌కు చేదు అనుభవం.. జర్నలిస్టు ప్రశ్నలకు జవాబు చెప్పలేక బాబర్‌ బిక్కమొహం

మ్యాచ్‌ అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం పాల్గొన్నాడు. మ్యాచ్‌ గురించి మట్లాడిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు పాక్‌ సారథి సిద్ధమయ్యాడు. దీంతో ఓ జర్నలిస్టు తీవ్రంగా స్పందించారు.

Babar Azam: ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాక్‌ కెప్టెన్‌కు చేదు అనుభవం.. జర్నలిస్టు ప్రశ్నలకు జవాబు చెప్పలేక బాబర్‌ బిక్కమొహం
Babar Azam

Updated on: Dec 31, 2022 | 1:53 PM

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ను పాకిస్థాన్ జట్టు డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లోనూ పాక్‌ జట్టు ఓటమి దిశగా పయనించినప్పటికీ బ్యాటర్ల రాణింపుతో గట్టెక్కింది. కాగా మ్యాచ్‌ అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం పాల్గొన్నాడు. మ్యాచ్‌ గురించి మట్లాడిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు పాక్‌ సారథి సిద్ధమయ్యాడు. దీంతో ఓ జర్నలిస్టు తీవ్రంగా స్పందించారు.. ‘ఇది సరైన పద్ధతి కాదు. ఇక్కడున్న వారు మిమ్మల్ని మరికొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. కానీ మేం ప్రశ్నలు అడగకముందే మీ మీడియా మేనేజర్ మైక్ ఆఫ్ చేసాడు’ అని పాక్‌ సారథి తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. దీంతో బాబర్‌కు కోపమొచ్చింది. ప్రశ్నించిన జర్నలిస్ట్‌ వైపు సీరియస్‌ ఓ లుక్కు ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా స్వదేశంలో పాకిస్థాన్ జట్టు వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-0తో కోల్పోయింది. అంతకు ఆస్ట్రేలియా 1-0 తేడాతో పాక్‌ను ఓడించింది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో ఆడుతున్న సిరీస్‌లోనూ పేలవంగా ఆడుతోంది. రెండు మ్యాచ్‌ల టెస్టులో తొలి మ్యాచ్ డ్రా కావడంతో ఇప్పుడు రెండో టెస్టు మ్యాచ్‌పై ఇరు జట్లూ కన్నేశాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలిస్తే పాక్‌ స్వదేశంలో హ్యాట్రిక్‌ టెస్టు సిరీస్‌లు కోల్పోయినట్లవుతుంది. కాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ డ్రా కావడంతో సొంతగడ్డపై ఒక్క టెస్టు విజయం కూడా లేకుండానే బాబర్‌ ఈ ఏడాది ముగించాడు. ఓవరాల్‌గా తొమ్మిదింట ఒక టెస్టు మాత్రమే గెలిచాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..