Pakistan Bowler: ఒకే మ్యాచ్‌లో 9 వికెట్లు సాధించిన పాకిస్తాన్ బౌలర్.. ఆ ఎఫెక్ట్ పంజాబ్ కింగ్స్ ఆటగాడికి తగిలింది..!
Pakistan Bowler: ఐపీఎల్‌కి దూరంగా ఓ పాకిస్తాన్ బౌలర్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఏకంగా ఒకే మ్యాచ్‌లో 9 వికెట్లు సాధించాడు. అయితే
Pakistan Bowler: ఐపీఎల్‌కి దూరంగా ఓ పాకిస్తాన్ బౌలర్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఏకంగా ఒకే మ్యాచ్‌లో 9 వికెట్లు సాధించాడు. అయితే అతడి ఆటతీరును ప్రశంసిస్తూ పంజాబ్ కింగ్స్ ఆటగాడు ట్వీట్ చేశాడు. వాస్తవానికి పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ ఇంగ్లండ్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడుతున్నాడు. ఒక్క మ్యాచ్‌లోనే 9 వికెట్లు పడగొట్టి తన జట్టు విజయానికి కారణమయ్యాడు. అయితే పంజాబ్ కింగ్స్ ఆటగాడు అతడిపై ప్రశంసల జల్లు కురిపించడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో మిగిలిన 3 వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతని జట్టు 57 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో లాంక్షైర్ గ్లౌసెస్టర్‌షైర్‌ను ఓడించింది. అయితే పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న లియామ్ లివింగ్‌స్టన్, హసన్ అలీ ఆటతీరు, లంకాషైర్ విజయం రెండింటినీ ప్రశంసించాడు. దీనికి కారణం కౌంటీ క్రికెట్‌లో లివింగ్‌స్టన్ లాంక్షైర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. పాక్ బౌలర్ కారణంగా తన కౌంటీ జట్టు గెలుపొందడం చూసినప్పుడు అతను హసన్ అలీని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లౌసెస్టర్‌షైర్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 254 పరుగులకు కుదించింది. దీనికి సమాధానంగా లాంక్షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 556 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ గ్లౌసెస్టర్‌షైర్ 247 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
మరిన్ని క్రికెట్ వార్తలకి ఇక్కడ క్లిక్ చేయండి
What a signing… what a win ??? https://t.co/bqei0nZohb
— Liam Livingstone (@liaml4893) April 24, 2022