IPL 2022: 39 బంతుల్లో 6 సిక్సర్లు 7 ఫోర్లు.. కానీ ఈ 36 ఏళ్ల ఆటగాడి శ్రమ వృథా..!
IPL 2022: క్రికెట్‌లో తుఫాన్ ఇన్నింగ్స్ అంటే ఏంటో తెలుసా.. అది నిన్న సీఎస్‌కే ప్లేయర్ అంబటి రాయుడు చూపించాడు. మైదానంలో
IPL 2022: క్రికెట్‌లో తుఫాన్ ఇన్నింగ్స్ అంటే ఏంటో తెలుసా.. అది నిన్న సీఎస్‌కే ప్లేయర్ అంబటి రాయుడు చూపించాడు. మైదానంలో ఫీల్డర్లని పరుగెత్తించాడు. బౌలర్లని ఊచకోత కోశాడు. మిడ్ వికెట్, లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్, షార్ట్ థర్డ్ మ్యాన్ ప్రతి షాట్ ఆడాడు. ఫీల్డర్లు ఎక్కడికక్కడ బంతిని పట్టుకునే పనిలో మునిగిపోయారు. అతడి బ్యాట్‌లోనే ఏదో మాయ ఉందని అనిపించింది. ఈ 36 ఏళ్ల బ్యాట్స్‌మెన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడినా చెన్నై ఓటమిని మాత్రం తప్పించలేదు.
6 సిక్సర్లు, 13 బంతుల్లో 64 పరుగులు..!
ముంబైలోని వాంఖడే మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్‌తో 78 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కేవలం 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. అంటే కేవలం 13 బంతుల్లోనే బౌండరీలతో 64 పరుగులు వచ్చాయి. ఈ ఇన్నింగ్స్‌లో అతను 5వ వికెట్‌కు జడేజాతో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.
ఈ సీజన్‌లో అంబటి రాయుడికి ఇదే తొలి అర్ధ సెంచరీ. అతను ఇప్పుడు IPL 2022లో చెన్నై సూపర్ కింగ్స్‌లో రెండో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల తర్వాత అతను 246 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ముందు పంజాబ్ కింగ్స్ 188 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. అంబటి రాయుడు రబాడ బౌలింగ్‌లో అవుటైనప్పుడు 13 బంతులు మిగిలి ఉన్నాయి. CSK స్కోరు 153 పరుగుల వద్ద ఉంది. అంటే గెలవాలంటే ఇంకా 35 పరుగులు చేయాల్సి ఉంది. కానీ ధోని ఎన్ని ప్రయత్నాలు చేసినా చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 11 పరుగుల దూరంలో నిలిచింది.
For his fine knock of 78 off 39 deliveries in the chase, @RayuduAmbati is our Top Performer from the second innings of the game.
A look at his batting summary here ?? #TATAIPL #PBKSvCSK pic.twitter.com/UuIf4mPtgR
— IndianPremierLeague (@IPL) April 25, 2022