ఈ పథకం కింద సన్న, చిన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు.. ఈ పత్రాలుంటే చాలు..!
Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. సాగు సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైతే
Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. సాగు సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైతే రైతులకు డబ్బులు అందించే పథకం ఇది . రైతులు ఎవరి దగ్గరా అప్పు చేయాల్సిన అవసరం లేదు. చిన్న, సన్నకారు రైతులు ఈ పథకం గరిష్ట ప్రయోజనాన్ని పొందవచ్చు. రాయితీ వడ్డీ రేటుతో రుణాలు తీసుకోవచ్చు. ప్రైవేటు వ్యక్తుల వద్ద రైతులు అధిక వడ్డీకి అప్పు తీసుకోవాల్సిన అవసరం లేకుండా కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ఒక వరంగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు
రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు పొందుతారు. దీనిపై వడ్డీ రేటు రెండు శాతం వరకు ఉంటుంది. రైతులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు రుణాలు మంజూరవుతాయి. ఇది రైతులకు ఎంతో ఊరటనిస్తుంది. అలాగే రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ఖాతాలో పొదుపు చేస్తే వారికి అధిక వడ్డీ రేటు లభిస్తుంది. భూమి ఉండి 18నుంచి 70 ఏండ్లలోపు వయస్సు ఉన్న రైతులందరూ ఏదైనా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంక్ ను సంప్రదించి కార్డును పొందొచ్చు. కామన్ సర్వీస్ సెంటర్, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు పత్రాలు లభిస్తాయి.
ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డుతోపాటు పట్టాదారు పాసుపుస్తకం తీసుకెళ్లి బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకులు ఐదేళ్ల కాలపరిమితితో కార్డులను జారీ చేస్తాయి. రెండున్నర ఎకరాల భూమి ఉన్నవారు రూ.2లక్షల వరకు, అంతకన్న ఎక్కువగా ఉన్న రైతులు రూ.3లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. ఏడుశాతం వడ్డీతో రుణం ఇస్తారు. సకాలంలో చెల్లిస్తే వడ్డీలో రాయితీ కూడా ఉంటుంది.
ఐదేళ్ల వరకు రుణం
కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద రుణం అనేది స్వల్ప కాలానికి (ఐదేళ్ల వరకు) ఇచ్చే వ్యవసాయ రుణం. ఇది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఇతర ప్రభుత్వ బ్యాంకుల ద్వారా అందిస్తారు. ఈ రుణాన్ని రైతులు పంటలు విత్తడానికి, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయం, పంటల బీమా ఖర్చులకు వినియోగించుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ 1998లో భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్ ద్వారా ప్రారంభించారు.
మరికొన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి