Watch Video: చిరుతలా దూకి.. కళ్లు చెదిరే క్యాచ్.. రిజల్టునే మార్చేసిన ఆల్ రౌండర్.. వీడియో చూస్తే షాకింగే..
Viral Video: షాదాబ్ ఖాన్ గాలిలో డైవింగ్ చేస్తూ అద్భుత క్యాచ్ పట్టాడు. బిగ్ బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ తరపున ఆడుతున్నాడు.

Shadab Khan Stunning Catch Video: పాకిస్థాన్ స్టార్ ఆల్ రౌండర్, టీ20 జట్టు వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ తన అద్భుతమైన క్యాచ్‌తో సోషల్ మీడియాలో చర్చల్లోకి వచ్చాడు. అతను పట్టుకున్న స్టన్నింగ్ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. షాదాబ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా దేశవాళీ టీ20 లీగ్ బిగ్ బాష్‌లో ఆడుతున్నాడు. అతను బిగ్ బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. హోబర్ట్ హరికేన్స్, పెర్త్ స్కార్చర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో షాదాబ్ రిటర్న్ క్యాచ్‌ను పట్టుకునేందుకు గాలిలో చిరుతపులిలా దూకి అద్భుత క్యాచ్ అందుకున్నాడు. షాదాబ్ ఖాన్ ఈ క్యాచ్ పట్టిన వీడియో చూస్తే, మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
అద్భుతమైన క్యాచ్‌తో తారుమారైన మ్యాచ్..
పెర్త్ చివరి 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా, కెప్టెన్ షాదాబ్‌పై నమ్మకం ఉంచాడు. షాదాబ్ తన కోటాలో చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఝే రిచర్డ్‌సన్, ఆరోన్ హార్డీ క్రీజులో ఉన్నారు. షాదాబ్ తన మొదటి రెండు బంతుల్లో ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. దీంతో బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగింది.




స్టన్నింగ్ క్యాచ్ వీడియో..
SHADAB KHAN!
That is fully horizontal. Scorchers need 14 from the final over #BBL12 pic.twitter.com/lCd2Av824h
— KFC Big Bash League (@BBL) December 19, 2022
మూడో బంతికి హార్డీ ముందు వైపు షాట్ ఆడాడు. షాదాబ్ గాలిలో ఫుల్ లెంగ్త్ డైవ్ చేస్తూ క్యాచ్ పట్టుకుని హార్డీని పెవియన్ చేర్చాడు. ఈ ఓవర్‌లో షాదాబ్ 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
షాదాబ్ అంతర్జాతీయ కెరీర్..
లెగ్ స్పిన్ బౌలర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ షాదాబ్ ఖాన్ పాకిస్తాన్ తరపున 6 టెస్టులు, 53 వన్డేలు, 84 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. టెస్టుల్లో, షాదాబ్ 34 సగటుతో 300 పరుగులు, వన్డేల్లో 29 సగటుతో 596 పరుగులు, టీ20 ఇంటర్నేషనల్స్‌లో 19 సగటుతో 476 పరుగులు చేశాడు. అదే సమయంలో టెస్టుల్లో 14 వికెట్లు, వన్డేల్లో 70 వికెట్లు, టీ20ల్లో 98 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
