IND vs AFG: భారత్‌కు భారీ టార్గెట్ ఇచ్చిన ఆఫ్ఘాన్.. 4 వికెట్లతో సత్తా చాటిన బుమ్రా.. బర్త్‌డే బాయ్ ఖాతాలో రెండు..
IND vs AFG 1st Innings Highlights: టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ టీం 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 272 పరుగులు సాధించింది. దీంతో భారత్‌కు 273 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఆఫ్ఘన్ కెప్టెన్ షాహిదీ 80 పరుగులు చేయగా మరో బ్యాటర్ఒ మర్‌జాయ్ 62 పరుగులతో ఆకట్టుకున్నాడు. భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. బర్త్ డే బాయ్ హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశాడు.

IND vs AFG 1st Innings Highlights: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ టీం భారత్‌కు 273 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఆఫ్ఘనిస్థాన్ తరపున కెప్టెన్ షాహిదీ 80 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, ఒమర్‌జాయ్ 62 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఏ బ్యాట్స్‌మెన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. బర్త్ డే బాయ్ హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశాడు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ జట్టు ఆరంభం బాగోలేదు. జట్టు స్కోరు 32 పరుగుల వద్ద 7వ ఓవర్‌లో ఇబ్రహీం జర్దాన్ (21) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అతడిని జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేశాడు. ఆ తర్వాత 13వ ఓవర్లో రహ్మానుల్లా గుర్బాజ్ రూపంలో జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 21 పరుగుల ఇన్నింగ్స్ ఆడి హార్దిక్ పాండ్యాకు గుర్బాజ్ బలి అయ్యాడు. జట్టు స్కోరు 63 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన తర్వాత అదే స్కోరు వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 14వ ఓవర్లో రహ్మత్ షా (16) రూపంలో జట్టుకు మూడో దెబ్బ తగిలింది.
హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఉమర్జాయ్ అద్భుత ఇన్నింగ్స్..
View this post on Instagram
కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఉమర్‌జాయ్‌ల అద్భుతమైన ఇన్నింగ్స్‌ల కారణంగా జట్టు మంచి స్కోరును చేరుకోగలిగింది. ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్, అజ్మతుల్లా ఉమర్జాయ్ నాలుగో వికెట్‌కు 121 (128) పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యానికి అఫ్గానిస్థాన్ 34.2 ఓవర్లకే వికెట్లను కాపాడుకోగలిగింది. ఆ తర్వాత అజ్మతుల్లా ఉమర్జాయ్ రూపంలో జట్టుకు నాలుగో దెబ్బ తగిలింది. దీని తర్వాత 43వ ఓవర్లో 225 పరుగుల స్కోరు వద్ద కుల్దీప్ యాదవ్ కెప్టెన్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌కు పెవిలియన్ దారి చూపించాడు.
View this post on Instagram
ఇలా వరుసగా వికెట్లు కోల్పోతూ ఆఫ్ఘాన్ టీం 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 272 పరుగులు సాధించింది.
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫరూఖల్ హాక్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








