Kane Williamson: 10 ఇన్నింగ్సుల్లో 6 సెంచరీలు.. కేన్‌ మామ తగ్గట్లేదుగా.. సచిన్‌ రికార్డుకు ఎసరు పెట్టేలా ఉన్నాడే

న్యూజిలాండ్‌లోని మౌంట్ మౌంగనుయ్ బే ఓవల్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ వరుస సెంచరీలు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 289 బంతుల్లో 16 ఫోర్లతో 118 పరుగులు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో మూడో స్థానంలో వచ్చిన విలియమ్సన్ 132 బంతుల్లో 1 భారీ సిక్సర్, 12 ఫోర్లతో 109 పరుగులు చేశాడు.

Kane Williamson: 10 ఇన్నింగ్సుల్లో 6 సెంచరీలు.. కేన్‌ మామ తగ్గట్లేదుగా.. సచిన్‌ రికార్డుకు ఎసరు పెట్టేలా ఉన్నాడే
Kane Williamson
Follow us
Basha Shek

|

Updated on: Feb 06, 2024 | 8:17 PM

న్యూజిలాండ్‌లోని మౌంట్ మౌంగనుయ్ బే ఓవల్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ వరుస సెంచరీలు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 289 బంతుల్లో 16 ఫోర్లతో 118 పరుగులు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో మూడో స్థానంలో వచ్చిన విలియమ్సన్ 132 బంతుల్లో 1 భారీ సిక్సర్, 12 ఫోర్లతో 109 పరుగులు చేశాడు. తద్వారా ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన 5వ న్యూజిలాండ్ బ్యాటర్‌ గా కేన్‌ మామ రికార్డుల్లో నిలిచాడు. అంతే కాకుండా ప్రస్తుత టెస్టు ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో విలియమ్సన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. స్మిత్ 107 టెస్ట్ మ్యాచ్‌ల్లో మొత్తం 32 సెంచరీలు సాధించాడు. తద్వారా ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా మొదటి స్థానంలో నిలిచాడు. 97 టెస్టు మ్యాచ్‌ల్లో 31 సెంచరీలు పూర్తి చేసిన కేన్ విలియమ్సన్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. జో రూట్ (30 సెంచరీలు) మూడో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ (29 సెంచరీలు) నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ ఖాతాలో 51 సెంచరీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కేన్ విలియమ్సన్ (118) సెంచరీ చేయగా, రచిన్ రవీంద్ర (240) డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆడిన దక్షిణాఫ్రికా జట్టు 162 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (109) భారీ సెంచరీతో చెలరేగాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. అలాగే తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగుల ఆధిక్యంతో మొత్తం 528 పరుగుల ఆధిక్యం సాధించింది.

ఒకే టెస్టులో రెండు సెంచరీలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..