టీ20 క్రికెట్ ఇక ఊపిరిపీల్చుకో.! డివిలియర్స్, కోహ్లీ కంటే ఈ విధ్వంసకర ప్లేయరే తోపు.. ఎవరంటే?
ట్రెండ్‌కు తగ్గట్టుగా క్రికెట్ కొత్తపుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు టెస్ట్, వన్డే మాత్రమే రాజ్యమేలాయి.. ఇప్పుడు పొట్టి ఫార్మాట్ వచ్చేసింది. ఈ ట్వీంటీ 20 క్రికెట్ వచ్చిన దగ్గర నుంచి ఫ్రాంచైజీ లీగ్, 100 లీగ్‌లు ఎక్కువైపోయాయి. ఇక ఫార్మాట్లకు తగ్గట్టుగా హీరోలు పుట్టుకురావడం సర్వసాధారణం.

ట్రెండ్‌కు తగ్గట్టుగా క్రికెట్ కొత్తపుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు టెస్ట్, వన్డే మాత్రమే రాజ్యమేలాయి.. ఇప్పుడు పొట్టి ఫార్మాట్ వచ్చేసింది. ఈ ట్వీంటీ 20 క్రికెట్ వచ్చిన దగ్గర నుంచి ఫ్రాంచైజీ లీగ్, 100 లీగ్‌లు ఎక్కువైపోయాయి. ఇక ఫార్మాట్లకు తగ్గట్టుగా హీరోలు పుట్టుకురావడం సర్వసాధారణం. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్.. ఇలా అన్ని ఫార్మాట్లలోనూ విధ్వంసకర ప్లేయర్స్‌గా పేరుతెచ్చుకున్న వీరిని.. అధిగమించడానికి వచ్చేశాడు మరో హీరో.. టీ20 క్రికెట్ ఇక ఊపిరిపీల్చుకో..! ఈ ప్లేయర్ కచ్చితంగా డివిలియర్స్, కోహ్లీ కంటే వీరతోపు. మరి అతడెవరో చూసేద్దాం..
మనం మాట్లాడుకునే ఆటగాడు మరెవరో కాదండీ.! దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్. రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి.. ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్‌పై దృష్టి సారించిన ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్.. స్వదేశంలో జరుగుతోన్న SA20 లీగ్‌లో దుమ్ములేపుతున్నాడు. పిచ్ ఏదైనా సరే.. ముందున్న ప్రత్యర్ధి ఎవరైనా సరే.. ఊచకోత మనోడికి వచ్చింది. తాజాగా జోబుర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫైయర్ 2లో క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. ఐదో నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు.. కేవలం 30 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. అతడి దెబ్బకు డర్బన్ సూపర్ జెయింట్స్ స్కోర్ ఒక్కసారిగా 200 మార్క్ దాటేసింది. క్లాసెన్ బరిలోకి వచ్చినప్పుడు.. జట్టు భారీ స్కోర్ సాధిస్తుందని అనుకోలేదు.
ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు క్లాసెన్. ఇక క్లాసెన్‌తో పాటు ముల్దర్ కూడా 23 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో అర్ధ సెంచరీ సాధించాడు. మరోవైపు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జోబుర్గ్ సూపర్ కింగ్స్.. డర్బన్ బౌలర్లు డాలా(4/38), నవీన్(2/27), ప్రిటోరియస్(2/17) దెబ్బకు 142 పరుగులకే ఆలౌట్ అయింది. ఇదిలా ఉండగా.. ఈ టోర్నమెంట్‌లో క్లాసెన్.. 12 మ్యాచ్‌ల్లో 25 ఫోర్లు, 37 సిక్సర్లతో 447 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా, క్లాసెన్.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.




