AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC: టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ రేసులో అశ్విన్.. 4 దేశాల నుంచి నలుగురు ఆటగాళ్లు ఎంపిక..

పురుషుల టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ రేసులో ఉన్న ఆటగాళ్ల పేర్లను ఐసీసీ ప్రకటించింది. ఈ రేసులో 4 దేశాల నుంచి నలుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు...

ICC: టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ రేసులో అశ్విన్.. 4 దేశాల నుంచి నలుగురు ఆటగాళ్లు ఎంపిక..
Ashwin
Srinivas Chekkilla
|

Updated on: Dec 28, 2021 | 3:25 PM

Share

పురుషుల టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ రేసులో ఉన్న ఆటగాళ్ల పేర్లను ఐసీసీ ప్రకటించింది. ఈ రేసులో 4 దేశాల నుంచి నలుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు. ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, శ్రీలంక ఆటగాళ్లను అభ్యర్థులుగా చేర్చారు. అశ్విన్‌తో పాటు, పురుషుల టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా ఐసీసీ నామినేట్ చేసిన ఆటగాళ్లలో జో రూట్, దిముత్ కరుణరత్నే, కైల్ జామీసన్ ఉన్నారు.

ఈ సంవత్సరం ప్రదర్శన ఆధారంగా ఐసిసి టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌కు ఆటగాళ్లను ఎంపిక చేసింది. జో రూట్ ఈ ఏడాది అసమానమైన రీతిలో బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపిస్తే, ఆర్. అశ్విన్ కూడా అర్ధ సెంచరీతో వికెట్లు సాధించాడు. ఈ ఏడాది న్యూజిలాండ్ తరఫున కైల్ జేమీసన్ మంచి ప్రదర్శన కనబరుస్తుండగా, శ్రీలంక తరఫున దిముత్ కరుణరత్నే ఓపెనింగ్‎లో అద్భుతంగా ఆడాడు. ‎ ఆర్. అశ్విన్

ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున 8 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌ 52 వికెట్లు పడగొట్టాడు. అతను 16.27 బౌలింగ్ సగటుతో ఉన్నాడు. అశ్విన్ బంతితో కాకుండా బ్యాట్‌తో కూడా రాణించాడు. ఈ ఏడాది కూడా 28.08 సగటుతో 337 పరుగులు చేశాడు.

జో రూట్

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఈ ఏడాది బ్యాటింగ్‌లో చాలా బాగా రాణించాడు. ఈ ఏడాది 15 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రూట్ 61 సగటుతో 1708 పరుగులు చేశాడు. అతను 6 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు సాధించాడు. అతను ఈ సంవత్సరం అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డు సాధించాడు.

కైల్ జేమీసన్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్‌పై కైల్ జేమీసన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది 5 టెస్టులాడిన జేమీసన్ 17.51​సగటుతో 27 వికెట్లు తీశాడు. అతను బ్యాటింగ్‌లో 17.50 సగటుతో 105 టెస్ట్ పరుగులు కూడా చేశాడు.

దిముత్ కరుణరత్నే

2021 సంవత్సరంలో శ్రీలంక ఓపెనర్ దిముత్ కరుణరత్నే అద్భుతంగా ఆడాడు. ఈ ఏడాది కరుణరత్నే 7 టెస్టుల్లో 70 సగటుతో 4 సెంచరీలతో 902 పరుగులు చేశాడు.

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా