IPL 2023: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. గాయంతో ఈ సీజన్‌కు దూరమైన స్టార్ బౌలర్?
ఇంగ్లండ్‌తో జరిగే 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టు ఫాస్ట్ బౌలర్ కైల్ జేమ్సన్‌ని జట్టులో చేర్చారు. అయితే వెన్నునొప్పి కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ ప్రారంభం కావడానికి మరో నెల సమయం మాత్రమే ఉంది. దీనికి ముందు కూడా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమ్సన్ రూపంలో భారీ దెబ్బ తగలవచ్చని తెలుస్తోంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో, చెన్నై సూపర్ కింగ్స్ రాబోయే సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. ఈ క్రమంలో జేమ్సన్ వెన్ను గాయం కారణంగా చెన్నై జట్టుకు ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది.
న్యూజిలాండ్ జట్టు ఫాస్ట్ బౌలర్ కైల్ జేమ్సన్ ఒత్తిడి ఫ్రాక్చర్ కారణంగా ఫిబ్రవరి 16న ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే 2-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉండవచ్చు. అతను రాబోయే IPL సీజన్‌లో ఆడలేడని భావిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆయన స్థానంలో మంచి ఎంపిక కోసం వెతకడం ప్రారంభించాల్సి ఉంటుంది. జేమ్సన్ గత 8 నెలలుగా తన స్ట్రెస్ ఫ్రాక్చర్ సమస్యతో పోరాడుతూ కనిపించాడు.
కైల్ జేమ్సన్ జూన్ 2022లో ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు మ్యాచ్ ఆడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతను ఇంగ్లండ్‌తో జరగబోయే స్వదేశీ టెస్ట్ సిరీస్‌లో ఆడతాడని అందరూ ఊహించారు. కానీ, అంతకు ముందు అతను మరోసారి గాయం కారణంగా క్రైస్ట్‌చర్చ్‌కు బయలుదేరాడు.
కివీ జట్టు ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ జేమ్సన్ గాయం గురించి మాట్లాడుతూ, కైల్ పూర్తిగా ఫిట్‌గా ఉండటానికి చాలా కష్టపడ్డాడు. అయితే అతను ప్రస్తుతం మైదానంలో ఆడటానికి పూర్తిగా ఫిట్‌గా లేడు. ఇది చాలా నిరాశపరిచింది. జూన్‌లో అతని గాయం గురించి మాకు తెలియగానే, మేం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. వైద్య సిబ్బంది అతని గాయంపై నిరంతరం నిఘా ఉంచారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
కైల్ నిష్క్రమణ చెన్నై బౌలింగ్‌పై ప్రభావం..
కైల్ జేమ్సన్ తన చిన్న కెరీర్‌లో కూడా ఫాస్ట్ బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇటువంటి పరిస్థితిలో, అతను రాబోయే ఐపీఎల్ సీజన్ నుంచి పూర్తిగా నిష్క్రమిస్తే, అది చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద దెబ్బే. టీమ్‌లో మహేష్ పతిరానా ఉన్నప్పటికీ.. కైట్ లేని లోటు స్పష్టంగా కనిపించవచ్చు. నిశాంత్ సిద్ధూ, తుషార్ దేశ్‌పాండే రూపంలో ఇప్పటికే మంచి ఎంపికలు ఉన్నాయి. అదే సమయంలో, ఈసారి జట్టుకు బెన్ స్టోక్స్ రూపంలో మంచి ఆల్ రౌండర్ ఆటగాడు ఉన్నాడు. అతను జట్టు కోసం సులభంగా 4 ఓవర్లు వేయగలడని చెన్నై టీం భావిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..