T20 World Cup: టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధం.. ఎవరు గెలిచినా సరికొత్త చరిత్రే..

|

Oct 20, 2024 | 11:15 AM

ICC Women's T20 World Cup 2024 Live telecast and Streaming: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు తుది పోరుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఇరుజట్ల హెడ్ టూ హెడ్ రికార్డులను పరిశీలిద్దాం.. ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య జరిగిన 16 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ జట్టుదే ఆధిపత్యంగా కనిపిస్తోంది. ఆ జట్టు 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

T20 World Cup: టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధం.. ఎవరు గెలిచినా సరికొత్త చరిత్రే..
T20 World Cup 2024 Sa Vs Nz
Follow us on

ICC Women’s T20 World Cup 2024 Live telecast and Streaming: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ ఉత్కంఠ చివరి దశలో ఉంది. ఇక్కడ న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. రెండు జట్లు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ పోరుకు చేరుకున్నాయి.

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ దుబాయ్‌లో..

10 జట్లతో అక్టోబర్ 3 నుంచి ప్రారంభమైన ఈ టోర్నీలో గట్టి పోటీ మధ్య న్యూజిలాండ్ మహిళల జట్టు, దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు ఫైనల్స్‌కు చేరాయి. టైటిల్ గెలవాలనే ఉద్దేశ్యంతో ఇరు జట్లు ఆదివారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో రంగంలోకి దిగనున్నాయి. దీంతో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగుతుందని అంతా భావిస్తున్నారు.

ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా అద్భుత ప్రదర్శన చేశాయి. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్స్‌కు టికెట్ బుక్ చేసుకోగా, రెండో సెమీలో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 8 పరుగుల తేడాతో ఓడించి న్యూజిలాండ్ మూడోసారి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.

ఫైనల్ మ్యాచ్ ఎక్కడ చూడాలి?

టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మహిళల టీ20 ప్రపంచ కప్ టైటిల్ పోరును ఆస్వాదించవచ్చు. స్టార్ స్పోర్ట్స్‌లోని వివిధ ఛానెల్‌లలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అలాగే డిస్నీ+ హాట్‌స్టార్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం (అక్టోబర్ 20) రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.

దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ల మధ్య టీ20 ఇంటర్నేషనల్‌లో హెడ్ టు హెడ్ రికార్డ్స్..

మొత్తం మ్యాచ్‌లు- 16

న్యూజిలాండ్ గెలిచింది- 11

దక్షిణాఫ్రికా గెలిచింది- 4

ఫలితం తేలనివి – 1

రెండు జట్లు..

దక్షిణాఫ్రికా మహిళల జట్టు: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), అన్నెకే బాష్, తజమిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నే డెర్క్‌సెన్, మైక్ డి రిడర్, అయాండా హ్లూబి, సినాలో జాఫ్తా, మరిజానా కాప్, అయాబొంగా ఖాకా, సునే లూస్, నాన్‌కులులేకో మ్లాబా, తుమిని, శేష్నీ .సెఖుఖునే, క్లో ట్రయాన్.

న్యూజిలాండ్ మహిళల జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇజ్జీ గేజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్, అమేలియా కెర్, జెస్ కెర్, రోజ్మేరీ మెయిర్, మోలీ పెన్‌ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవ్, లీ తహుహు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..