Rachin Ravindra: ధోని టీం నయా ఆల్ రౌండర్‌ దూకుడు.. టెస్టుల్లో తొలి శతకాన్నే డబుల్ సెంచరీగా మార్చేశాడుగా..

New Zealand vs South Africa, 1st Test: న్యూజిలాండ్ తరపున ఆడుతున్న కర్ణాటకకు చెందిన 24 ఏళ్ల రచిన్ రవీంద్ర ఇప్పటికే 4 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. గత వన్డే ప్రపంచకప్‌లో 3 అద్భుతమైన సెంచరీలు చేసిన రచిన్, ఇప్పుడు టెస్టు క్రికెట్‌లో తన తొలి డబుల్ సెంచరీని నమోదు చేశాడు. 24 ఏళ్ల రచిన్ రవీంద్రకు ఇది 3 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. ఇక టెస్ట్ క్రికెట్‌లో తన తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చేశాడు. ఇంతకు ముందు రచిన్ వన్డే క్రికెట్‌లో 3 సెంచరీలు చేశాడు. ఈ మూడు వన్డే సెంచరీలు 2023 ప్రపంచకప్‌లో వచ్చాయి.

Rachin Ravindra: ధోని టీం నయా ఆల్ రౌండర్‌ దూకుడు.. టెస్టుల్లో తొలి శతకాన్నే డబుల్ సెంచరీగా మార్చేశాడుగా..
Rachin Ravindra
Follow us
Venkata Chari

|

Updated on: Feb 05, 2024 | 10:18 AM

Rachin Ravindra Double Century: దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్‌లోని మౌంట్ మౌంగానుయ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ రచిన్ రవీంద్ర తన తొలి డబుల్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు టామ్ లాథమ్ (20), డెవాన్ కాన్వే (1) ఆరంభంలోనే వికెట్లను లొంగిపోయారు. ఈ దశలో కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర కలిసి న్యూజిలాండ్‌ను తొలి షాక్ నుంచి కాపాడారు.

ఆరంభం నుంచి జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన రచిన్ రవీంద్ర.. కేన్ విలియమ్స్‌కు మంచి సహకారం అందించాడు. ఫలితంగా 241 బంతుల్లో విలియమ్సన్ తన 30వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

మరోవైపు ఆకర్షణీయమైన షాట్లతో పరుగులు రాబట్టిన రచిన్ రవీంద్ర 189 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో తొలి టెస్టు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీని ద్వారా టెస్టు క్రికెట్‌లోనూ సత్తా చాటడంలో రచిన్ రవీంద్ర సఫలమయ్యాడు.

ఈ అజేయ సెంచరీలతో రచిన్ రవీంద్ర (118), కేన్ విలియమ్సన్ (112) మూడో వికెట్‌కు 219 పరుగులు జోడించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. అనంతరం రెండో రోజు ఆట కొనసాగించిన కివీస్ జట్టు 511 పరుగులకు ఆలౌట్ అయింది. రచిన్ రవీంద్ర 240 పరుగులు చేశాక పెవిలియన్ చేరాడు. ఇందులో 26 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.

24 ఏళ్ల రచిన్ రవీంద్రకు ఇది 3 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. ఇక టెస్ట్ క్రికెట్‌లో తన తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చేశాడు. ఇంతకు ముందు రచిన్ వన్డే క్రికెట్‌లో 3 సెంచరీలు చేశాడు. ఈ మూడు వన్డే సెంచరీలు 2023 ప్రపంచకప్‌లో వచ్చాయి.

గత ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన రచిన్ 578 పరుగులు చేసి న్యూజిలాండ్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టెస్టు క్రికెట్‌లోనూ సెంచరీ ఖాతా తెరిచిన ఈ యువ స్ట్రైకర్ నుంచి రానున్న రోజుల్లో గొప్ప బ్యాటింగ్ ప్రదర్శనను ఆశించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..