AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 గంటల్లో 55 రన్స్.. కట్‌చేస్తే.. జట్టుకు చారిత్రాత్మక విజయం.. సచిన్, గంగూలీకి విక్టరీ సీక్రెట్ చెప్పిన దిగ్గజం.. ఎవరంటే?

John Wright Birthday: జాన్ రైట్ నేటితో 69వ ఏట అడుగుపెట్టనున్నాడు. ఐదేళ్ల పాటు టీమిండియా కోచ్‌గా పనిచేశాడు. అతను టీమిండియా ముఖచిత్రాన్ని మార్చేశాడు. అతని కోచింగ్‌లో భారత్ ఎన్నో పెద్ద మ్యాచ్‌ల్లో గెలిచింది.

6 గంటల్లో 55 రన్స్.. కట్‌చేస్తే.. జట్టుకు చారిత్రాత్మక విజయం.. సచిన్, గంగూలీకి విక్టరీ సీక్రెట్ చెప్పిన దిగ్గజం.. ఎవరంటే?
John Wright Birthday
Venkata Chari
|

Updated on: Jul 05, 2023 | 12:24 PM

Share

సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీల జట్టుకు విదేశాల్లో ఎలా గెలవాలో నేర్పిన దిగ్గజం ఈరోజు 69వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈరోజు టీమిండియా తొలి విదేశీ కోచ్ పుట్టినరోజు. టీమిండియా రూపురేఖలను మార్చిన పేరు జాన్ రైట్. 5 సంవత్సరాల పదవీకాలంలో, జాన్ రైట్ టీమిండియా లోపాలను పూడ్చేశాడు. ఆ తర్వాత జట్టు విదేశాలలో గెలుపొందడం ప్రారంభించింది. జట్టులో సాంకేతికంగా కూడా చాలా మార్పులు చేశాడు. అతని రాక తర్వాత 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన కోల్‌కతా టెస్టులో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో చారిత్రాత్మక నాట్‌వెస్ట్ ట్రోఫీని గెలుచుకుంది.

భారత క్రికెట్‌లో టీమిండియా ముఖ చిత్రాన్ని మార్చడంలో జాన్ రైట్ ప్రసిద్ధి చెందాడు. కోచ్‌గా టీమిండియాకు ఎన్నో చారిత్రాత్మక విజయాలు అందించాడు. ఆటగాడిగా కూడా న్యూజిలాండ్‌ను ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లు గెలిపించాడు.

6 గంటలు.. 55 పరుగులు..

ఇది దాదాపు ఫిబ్రవరి 1978 నాటి సంఘటన. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రైట్ 6 గంటల పాటు బ్యాటింగ్ చేసి 6 గంటల్లో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 48 ప్రయత్నాలలో ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ తొలి విజయంలో అతని ఇన్నింగ్స్ కీలకంగా మారింది. ఆ చారిత్రాత్మక మ్యాచ్‌లో న్యూజిలాండ్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

ఐదేళ్లపాటు భారత్‌కు కోచ్‌గా..

5 జులై 1954న జన్మించిన రైట్ తన 82 టెస్టు కెరీర్‌లో 12 సెంచరీలు సాధించాడు. ఇందులో 9 డ్రా మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. తన కెరీర్‌లో రెండుసార్లు 99 పరుగుల వద్ద, ఒకసారి 98 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. భారత్‌పై అతని సగటు 61గా నిలిచింది. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, రైట్ 5 సంవత్సరాల పాటు టీమిండియా కోచ్‌గా కొనసాగాడు. ఆ తరువాత అతను న్యూజిలాండ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. అక్కడ అతను హోబర్ట్‌లో ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయానికి కివీ జట్టును నడిపించాడు. 2011 ప్రపంచ కప్‌లో జట్టును సెమీ-ఫైనల్‌కు తీసుకెళ్లాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..