AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Cricket Team: టీమిండియా మాజీ ప్లేయర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

Praveen Kumar: టీమిండియా మాజీ ప్లేయర్ ప్రవీణ్ కుమార్ గత రాత్రి (మంగళవారం అర్థరాత్రి) మీరట్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. తన కారులో వెళ్తుండగా వేగంగా వస్తున్న క్యాంటర్ బలంగా ఢీకొట్టింది.

Indian Cricket Team: టీమిండియా మాజీ ప్లేయర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..
Praveen Kumar
Venkata Chari
|

Updated on: Jul 05, 2023 | 11:14 AM

Share

Praveen Kumar Car Accident: టీమిండియా మాజీ ప్లేయర్ ప్రవీణ్ కుమార్ గత రాత్రి (మంగళవారం అర్థరాత్రి) మీరట్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. తన కారులో వెళ్తుండగా వేగంగా వస్తున్న క్యాంటర్ బలంగా ఢీకొట్టిందంట. ఆ కారులో మాజీ క్రికెటర్‌తోపాటు ఆయన కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదం నుంచి తండ్రి కోడుకులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారంట. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని, నిందితుడు క్యాంటర్ డ్రైవర్‌ను పట్టుకున్నారంట

ప్రవీణ్ కుమార్ జులై 4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తన ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనంలో మీరట్‌లోని పాండవ్ నగర్ నుంచి వస్తున్నాడు. ఇదే సమయంలో ఎదురుగా వస్తోన్న క్యాంటర్‌ ఢీకొట్టడంతో ప్రవీణ్ కుమార్ కారు బాగా డ్యామేజ్ అయిందంట. కాగా, ఈ మాజీ భారత్ క్రికెటర్ ఇల్లు మీరట్ సిటీ బాగ్‌పత్ రోడ్‌లో ఉన్న ముల్తాన్ నగర్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

2012లో భారత జట్టు తరపున చివరి మ్యాచ్‌..

ప్రవీణ్ కుమార్ టీమిండియా తరపున 2012లో తన చివరి మ్యాచ్ ఆడాడు. కాగా, 2008లో కామన్ వెల్త్ బ్యాంక్ సిరీస్ (Commonwealth Bank Series) గెలుచుకున్న టీంలో ప్రవీణ్ కుమార్ సభ్యుడిగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడి విజయం సాధించింది. ప్రవీణ్ కుమార్ బంతితో కీలక పాత్ర పోషించాడు.

ఇవి కూడా చదవండి

అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవీణ్‌కుమార్‌ గణాంకాలు పరిశీలిస్తే… 68 వన్డేలు, 6 టెస్టు మ్యాచ్‌లు, 10 టీ20లు ఆడాడు. టీ20ల్లో 8, వన్డేల్లో 77, టెస్టుల్లో 27 వికెట్లు పడగొట్టాడు. భారత రిచ్ లీగ్ ఐపీఎల్‌లో 119 మ్యాచ్‌లు ఆడిన ప్రవీణ్ కుమార్.. 90 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..