డియర్ భారత్ ఫ్యాన్స్… ఫైనల్ టికెట్లు వెనక్కిచ్చేయరూ!

| Edited By: Srinu

Jul 13, 2019 | 8:36 PM

ఐసీసీ ప్రపంచకప్ 2019 నేపథ్యంలో కోహ్లీసేన తుదిపోరుకు చేరుతుందని భావించి భారత అభిమానులు ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లను ముందుగానే కొనుగోలు చేశారు. లార్డ్స్‌ మైదానంలో 30వేల సామర్థ్యం ఉంది. దాంట్లో దాదాపు 80 శాతం టికెట్లు భారత అభిమానులే కొన్నట్లు సమాచారం. అనూహ్యంగా ఫైనల్‌ ఇంగ్లాండ్‌×న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. దీంతో ఇంగ్లాండ్‌, కివీస్‌ అభిమానులు టికెట్లు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కివీస్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ టికెట్ల కోసం భారత అభిమానులను అభ్యర్థించాడు. […]

డియర్ భారత్ ఫ్యాన్స్... ఫైనల్ టికెట్లు వెనక్కిచ్చేయరూ!
Follow us on

ఐసీసీ ప్రపంచకప్ 2019 నేపథ్యంలో కోహ్లీసేన తుదిపోరుకు చేరుతుందని భావించి భారత అభిమానులు ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లను ముందుగానే కొనుగోలు చేశారు. లార్డ్స్‌ మైదానంలో 30వేల సామర్థ్యం ఉంది. దాంట్లో దాదాపు 80 శాతం టికెట్లు భారత అభిమానులే కొన్నట్లు సమాచారం. అనూహ్యంగా ఫైనల్‌ ఇంగ్లాండ్‌×న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. దీంతో ఇంగ్లాండ్‌, కివీస్‌ అభిమానులు టికెట్లు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కివీస్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ టికెట్ల కోసం భారత అభిమానులను అభ్యర్థించాడు.

‘ప్రియమైన భారత అభిమానుల్లారా.. మీకు ఫైనల్‌ మ్యాచ్‌కు రావాలని లేకపోతే దయచేసి మీ టికెట్లను తిరిగి ఐసీసీ వెబ్‌సైట్‌లోనే అమ్మండి. ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లకు బయట మంచి డిమాండ్‌ ఉంటుందని నాకు తెలుసు. కానీ, నిజమైన క్రికెట్‌ అభిమానులు కూడా మ్యాచ్ చూడటానికి ఒక అవకాశం ఇవ్వండి.’ అంటూ ట్వీట్‌ చేశాడు. దీనిపై భారత అభిమానులు స్పందిస్తున్నారు. న్యూజిలాండ్‌కు మద్దతు ఇస్తామని కామెంట్లు పెడుతున్నారు. సెమీస్ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్‌ కెప్టెన్ విలియమ్సన్‌ కూడా భారత అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు. ఫైనల్లో భారత అభిమానులు కివీస్‌కు మద్దతు ఇవ్వాలని కోరాడు. ఐసీసీ రిటర్న్‌ పాలసీని తమ వెబ్‌సైట్‌లో చేర్చింది. దీనిలో అభిమానులు టికెట్లను తిరిగి విక్రయించొచ్చు. అలా విక్రయిస్తే టికెట్ మొత్తం ధ‌రని తిరిగి చెల్లిస్తామని కూడా ప్రకటించింది.