Sponsor Deal : డ్రీమ్ 11 పోతే పోయింది కానీ.. కొత్త స్పాన్సర్‌తో బీసీసీఐ పై నోట్ల కట్టల వర్షం.. అక్షరాల ఎన్ని వందల కోట్లంటే ?
భారత పార్లమెంట్లో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత, డ్రీమ్11, బీసీసీఐతో తన కాంట్రాక్ట్‌ను ముగించాల్సి వచ్చింది. ఏసియా కప్ 2025 దగ్గర పడుతుండటంతో, బీసీసీఐపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్‌డీటీవీ ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం బోర్డు 2025-2028 కాలానికి కొత్త స్పాన్సర్‌ను వెతుకుతోంది.

Sponsor Deal : భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్ షిప్ కోసం కొత్త కంపెనీని వెతికే పనిలో బీసీసీఐ ఉంది. ఇటీవల భారత పార్లమెంటులో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత డ్రీమ్11, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)తో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఆసియా కప్ 2025 దగ్గర పడుతున్న నేపథ్యంలో.. బీసీసీఐపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్‌డిటివి ఒక నివేదికను రిలీజ్ చేసింది. దాని ప్రకారం బీసీసీఐ 2025-2028 మధ్య కొత్త స్పాన్సర్ కోసం చూస్తోంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 452 కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది.
డ్రీమ్11 స్థానంలో కొత్త స్పాన్సర్
2023లో డ్రీమ్11, బీసీసీఐతో దాదాపు రూ. 358 కోట్ల ఒప్పందంపై సంతకం చేసింది. కానీ కొత్త ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు కారణంగా ఆ ఒప్పందం ఒక సంవత్సరం ముందే ముగిసిపోయింది. ఎన్‌డిటివి నివేదిక ప్రకారం.. బీసీసీఐ 2025-2028 కాలానికి కొత్త స్పాన్సర్‌ను వెతుకుతోంది. ఈ కాలంలో భారత జట్టు సుమారు 140 మ్యాచ్‌లు ఆడనుంది. ఇది డ్రీమ్11తో పోలిస్తే డబ్బు పరంగా చాలా పెద్ద డీల్. ఈ స్పాన్సర్‌షిప్ డీల్ దేశంలో, విదేశాల్లో జరిగే మ్యాచ్‌లకు మాత్రమే కాకుండా, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC), ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహించే టోర్నమెంట్‌లకు కూడా వర్తిస్తుంది.
ప్రతి మ్యాచ్‌కు భారీ ధర
బీసీసీఐ ప్రతి ద్వైపాక్షిక మ్యాచ్‌కు రూ. 3.5 కోట్ల ధరను నిర్ణయించింది. ఐసీసీ, ఏసీసీ టోర్నమెంట్‌లలో జరిగే ప్రతి మ్యాచ్‌కు రూ. 1.5 కోట్ల టార్గెట్ ధరను పెట్టుకుంది. ఈ మొత్తం డ్రీమ్11తో పోలిస్తే ఎక్కువ, కానీ గతంలో ఉన్న బైజూస్ డీల్ కంటే తక్కువ.
ఆసియా కప్ జెర్సీ పరిస్థితి ఏమిటి?
ఆసియా కప్ ప్రారంభానికి ముందే కొత్త స్పాన్సర్‌ను ఖరారు చేయాలని బీసీసీఐ కోరుకుంటోంది. కానీ సమయం తక్కువగా ఉంది. అందుకే ఆసియా కప్‌కు కొత్త స్పాన్సర్ దొరికే అవకాశం తక్కువగా ఉంది. అయితే, మహిళల వన్డే వరల్డ్ కప్ 2025కు ముందు కొత్త స్పాన్సర్‌షిప్ డీల్ ఖరారయ్యే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




