Afghanistan: ఆఫ్గనిస్తాన్‌లో తాలిజన్ల హవా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీనికి పాకిస్తాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మద్దతు పలకడం నెటిజన్లలో ఒక వర్గానికి నచ్చలేదు. తాలిబన్లు పొరుగు దేశంలో సానుకూలతకు ప్రయత్నిస్తున్నారని, మహిళలకు అవకాశాలు ఇస్తున్నారని, అలాగే క్రికెట్‌ని ఇష్టపడుతున్నారని పేర్కొంటూ పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది తాలిజన్లకు బహిరంగంగా మద్దతు పలికాడు. అలాగే ‘రాడికలైజేషన్’, ‘తాలిబాన్ ప్రీమియర్ లీగ్’ వంటి పదాలను ఉపయోగించడంతో పలు వివాదాలకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఒక నెటిజన్ షాహిద్‌ని ‘తాలిబన్ ప్రేమికుడు’ అని కామెంట్ చేశాడు. మానవత్వం, మహిళల స్వేచ్ఛకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న తాలిబన్‌లకు మద్దతు పలుకుతూ అఫ్రిది ప్రకటన చేయడంతో నెగిటివ్ కామెంట్లతో బాగా ట్రోల్ చేశారు. ‘తాలిబన్ క్రికెట్ టీమ్’, ‘తాలిబన్ ప్రీమియర్ లీగ్’ అంటూ అఫ్రిది చేసిన ప్రకటనపై కొందరు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాంటి మ్యాచ్‌లు ఆయుధాలు, మందుగుండు సామగ్రితో నడుస్తాయంటూ విమర్శలు గుప్పించారు.
పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పార్టీ అధికార ప్రతినిధి తాలిబన్ పాకిస్తాన్ నుండి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు చేసిన ప్రకటన సంచలనగా మారింది. దీనిపై ఒక నెటిజన్ అఫ్రిదిని ట్రోల్ చేశాడు. అఫ్రిదినీ ‘పాకిస్తాన్ తదుపరి ప్రధాని’ అంటూ పిలిచాడు.
అలాంటి ప్రకటన చేయడానికి ముందు ఆఫ్గనిస్తాన్ క్రికెట్ స్టార్ రషీద్ ఖాన్‌తో అఫ్రిది మాట్లాడాడా అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. తాలిబన్ మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై అఫ్రిది చేసిన ప్రకటనతో మరొకరు విభేదించారు. ఒకవేళ తాలిబన్లు నిజంగా అంత మంచివారైతే, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తాలిబన్లకు అప్పగించాలని ఒక నెటిజన్ చమత్కరించాడు.
పాత్రికేయులతో షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ, “తాలిజన్లు చాలా సానుకూల మనస్తత్వంతో ఉన్నారు. ఇంతకు ముందు వారిని ఇలా చూడలేదు. మహిళలు పని చేసేందుకు వారు ఒప్పుకున్నారు. రాజకీయాలు, ఇతరత్రా ఉద్యోగాలు చేసేందుకు ఒప్పుకున్నారు”. దీంతో నెటిజన్లు దారుణంగా ట్రోట్ చేయడం మొదలుపెట్టారు.
Meet Taliban lover -Shahid Afridi who openly supports Taliban
A dreaded terror org which is completely against humanity & freedom of women.He is no less than a radicalised Jihadi !It’s a reflection of radicalisation level & affinity towards terrorism in Pakistani society ! pic.twitter.com/W3dfyW1wiy
— Major Surendra Poonia (@MajorPoonia) August 31, 2021
So we will have Taliban cricket team soon ! Shahid Afridi says Taliban have come with very positive mind .. they will allow women to work and join politics and they like cricket too pic.twitter.com/Rt492aIML9
— exsecular (@ExSecular) August 30, 2021
WATCH: Shahid Afridi openly supports #Taliban, says ‘this time things moving towards positivity’ https://t.co/KHR8pW8tZJ
— Republic (@republic) August 31, 2021
Chor chor mausere bhai..this phrase suits perfectly to #Taliban Nd pak.both countries dont consider women as a human forget abt d future they dont hv a present there. Pak Is a modern form of taliban.both think Nd act same but pak don’t hv d courage to accept itself as terrorist
— Deepika (@Deepika93852551) August 31, 2021
#ShahidAfridi : Taliban will promote cricket and allow women to work, won’t you ?#Taliban : pic.twitter.com/RVhzFsZuiv
— श्रद्धा | Shraddha ?? (@immortalsoulin) August 31, 2021
Former Pakistan captain #ShahidAfridi has said the Taliban militant group came with a “very positive mind”. “Taliban is allowing ladies to work. And I believe the group likes cricket a lot,” Afridi said.
Next PM of Pakistan ???♂️ pic.twitter.com/I5i82CDj2X
— Tushar Kant Naik ??ॐ♫₹ (@Tushar_KN) August 31, 2021