IPL 2023: ఎవరీ తేజ నిడమనూరు.? ఆంధ్రా ప్లేయర్‌పై కన్నేసిన సన్‌రైజర్స్.. ‘నెదర్లాండ్స్ కోహ్లీ’ అంటూ!
వరల్డ్‌కప్ క్వాలిఫైయర్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరోచిత ఇన్నింగ్స్‌తో లైమ్‌లైట్‌లోకి వచ్చాడు డచ్ ప్లేయర్ తేజ నిడమనూరు. ఆ సమయంలో..
వరల్డ్‌కప్ క్వాలిఫైయర్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరోచిత ఇన్నింగ్స్‌తో లైమ్‌లైట్‌లోకి వచ్చాడు డచ్ ప్లేయర్ తేజ నిడమనూరు. ఆ సమయంలో కరేబియన్ జట్టు నిర్దేశించిన 375 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో నెదర్లాండ్స్ తరపున తేజ నిడమానూరు అద్భుతమైన సెంచరీ చేసి అదరగొట్టాడు. 22వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగిన తేజ.. ఇన్నింగ్స్ 46వ ఓవర్ వరకు క్రీజులో నిలబడి మొత్తం 76 బంతుల్లో 111 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడు 11 ఫోర్లు, 3 సిక్సర్లు బాదేశాడు. ఇక ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు తేజ. డచ్ టీం తరపున ఆడుతోన్న తేజ అసలెవరు.? అతడి నేపధ్యం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందామా..
1994, ఆగష్టు 22న ఏపీలోని విజయవాడలో పుట్టాడు తేజ నిడమానూరు. చిన్నతనంలోనే అతడి కుటుంబం విజయవాడ నుంచి న్యూజిలాండ్ వెళ్లిపోవడంతో.. అక్కడ ఆక్లాండ్‌లో క్రికెట్ పాఠాలు నేర్చుకుని.. డొమెస్టిక్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ వెంటనే తేజకు నెదర్లాండ్స్‌లో ఉద్యోగం రావడంతో.. భారత్.. వయా న్యూజిలాండ్.. టూ నెదర్లాండ్స్ చేరుకున్నాడు. డచ్ దేశంలో ఉద్యోగం చేస్తూ.. తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ను కూడా మర్చిపోకూడదనే ఉద్దేశంలో ఉట్రెక్ట్‌లోని కంపాంగ్ క్లబ్ తరపున ఆడాడు. ఈలోగా తమ దేశం తరపున ఆడాలంటూ నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు నుంచి పిలుపు వచ్చింది.
నెదర్లాండ్స్ తరపున మంచి ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన తేజ నిడమానూరు.. వన్డేల్లోకి అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌లో డచ్ జట్టు ఓడిపోయినప్పటికీ.. తేజ బ్యాటింగ్‌కు మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 96 బంతుల్లో 110 పరుగులు చేశాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా తేజ నిడమానూరుపై కన్నేశాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ జట్టు కావ్య మారన్ ఐపీఎల్ మినీ వేలంలో తేజను కొనుగోలు చేయాలని భావిస్తోందట. ఒకవేళ అదే నిజమైతే తేజ సుడి తిరిగినట్లే..!