AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP T20 League 2026: ఎవడ్రా నువ్వు.. ఆ ఐదురుగు దగ్గర నేర్చుకుని ఏకంగా 6 వికెట్లు తీశావ్

UP T20 League 2026: యూపీ టీ20 లీగ్ 2026లో నోయిడా సూపర్ కింగ్స్ తరఫున నమన్ తివారీ సంచలన బౌలింగ్‌తో అదరగొట్టాడు. గోరఖ్‌పూర్ లయన్స్‌పై కేవలం 23 బంతుల్లో 13 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, బోల్ట్, స్టార్క్, మలింగ, జహీర్ ఖాన్ వంటి దిగ్గజాల నుంచి మెళకువలు నేర్చుకున్న ఈ యువ పేసర్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

UP T20 League 2026: ఎవడ్రా నువ్వు.. ఆ ఐదురుగు దగ్గర నేర్చుకుని ఏకంగా 6 వికెట్లు తీశావ్
Naman Tiwari
Rakesh
|

Updated on: Aug 25, 2026 | 11:31 AM

Share

UP T20 League 2026: యూపీ టీ20 లీగ్ 2026లో 20 ఏళ్ల యంగ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ నమన్ తివారీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. నోయిడా సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన ఈ యంగ్ సెన్సేషన్ కేవలం 23 బంతుల్లో 13 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌ను ఏలిన ఐదుగురు దిగ్గజ బౌలర్ల నుంచి మెళకువలు నేర్చుకున్న ఈ యంగ్ స్టార్ టాలెంటుకు క్రికెట్ ప్రపంచం ఫిదా అవుతోంది. ఆగస్టు 24న నోయిడా సూపర్ కింగ్స్, గోరఖ్‌పూర్ లయన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నమన్ తివారీ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విరుచుకుపడ్డాడు. తన స్పెల్‌లో వేసిన 3.5 ఓవర్లలో (23 బంతులు) కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి గోరఖ్‌పూర్ లయన్స్ బ్యాటింగ్ లైనప్‌లోని ఆరుగురు బ్యాటర్లను పెవిలియన్‌కు పంపాడు. నమన్ ధాటికి ముందుగా బ్యాటింగ్ చేసిన గోరఖ్‌పూర్ జట్టు 17.5 ఓవర్లలోనే 112 పరుగులకు ఆలౌటైంది. ఈ సులువైన లక్ష్యాన్ని నోయిడా సూపర్ కింగ్స్ 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించి విజయం సాధించింది. ఈ లీగ్‌లో నమన్ ఇప్పటివరకు 5 మ్యాచుల్లో 10 వికెట్లు తీసి టాప్ ఫామ్‌లో ఉన్నాడు.

నమన్ తివారి బౌలింగ్‌లో కనిపిస్తున్న ఈ స్పీడ్ వెనుక క్రికెట్ దిగ్గజాల మార్గదర్శకత్వం ఉంది. ట్రెంట్ బోల్ట్, మిచెల్ స్టార్క్‌లను తన హీరోలుగా భావించే నమన్, రాజస్థాన్ రాయల్స్ నెట్ బౌలర్‌గా ఉన్న సమయంలో బోల్ట్‌ను కలిసి స్వింగ్ మెళకువలు నేర్చుకున్నాడు. అదే సమయంలో యార్కర్లు ఎలా వేయాలో లసిత్ మలింగ నుంచి సలహాలు తీసుకున్నాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నప్పుడు జస్ప్రీత్ బుమ్రా నుంచి యార్కర్లు, వేగం పెంచే పద్ధతులు తెలుసుకున్నాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ నెట్ బౌలర్‌గా పనిచేసిన రోజుల్లో ఆ జట్టు బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్ నుంచి ఇన్-స్వింగ్ బాల్స్ ఎలా వేయాలో నేర్చుకున్నాడు.

ఇది కూడా చదవండి: IND vs SL: కొలంబో టెస్ట్‌లో అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం.. గ్లౌజులు విసిరికొట్టిన శ్రీలంక ప్లేయర్

నమన్ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి ఈ స్థాయికి చేరుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని దేవురియా జిల్లాకు చెందిన నమన్‌ను మంచి క్రికెటర్‌గా మార్చేందుకు ఆయన తండ్రి లక్నోలోని గోమతీ నగర్‌కు మకాం మార్చారు. ఆరంభంలో నమన్ క్రికెట్‌ను సరదాగా తీసుకునేవాడు. ఒకరోజు తండ్రి గుండెపోటుకు గురికావడంతో కుటుంబ పరిస్థితి తిరగబడింది. తండ్రి ఆరోగ్యం క్షీణించడం, ఇంటి బాధ్యతలు గుర్తొచ్చిన నమన్ అప్పటి నుంచి ఆటను సీరియస్‌గా తీసుకుని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు.

2024 అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన నమన్ తివారి, ఇప్పుడు డొమెస్టిక్ లీగ్‌లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. దేశం తరఫున నమన్ ప్రపంచకప్ గెలవాలనేది ఆయన తండ్రి కన్నుల కల. ప్రపంచ స్థాయి బౌలర్ల వద్ద నేర్చుకున్న మెళకువలు, సొంత ప్రతిభతో ముందడుగు వేస్తున్న ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ త్వరలోనే టీమిండియాలోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: Most Centuries: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు.. ధోనీ ఏ ప్లేసులో ఉన్నాడంటే ?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us