AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Musheer Khan: ‘ఇది నాకు పునర్జన్మ.. దేవుడికి ధన్యవాదాలు’.. కారు ప్రమాదంపై సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు

ఇటీవల ఉత్తరప్రదేశ్ నుంచి లక్నో వెళుతుండగా టీమిండియా యంగ్ క్రికెటర్, సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. అతను ప్రయాణిస్తోన్న కారు ఆదుపుతప్పడంతో క్రికెటర్ కు మెడకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వెంటనే అతనిని లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు. ముషీర్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ వస్తోంది మేదాంత హాస్పిటల్.

Musheer Khan: 'ఇది నాకు పునర్జన్మ.. దేవుడికి ధన్యవాదాలు'.. కారు ప్రమాదంపై సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు
Musheer Khan
Basha Shek
|

Updated on: Oct 01, 2024 | 6:56 AM

Share

ఇటీవల ఉత్తరప్రదేశ్ నుంచి లక్నో వెళుతుండగా టీమిండియా యంగ్ క్రికెటర్, సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. అతను ప్రయాణిస్తోన్న కారు ఆదుపుతప్పడంతో క్రికెటర్ కు మెడకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వెంటనే అతనిని లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు. ముషీర్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ వస్తోంది మేదాంత హాస్పిటల్. ప్రస్తుతం ముషీర్ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఇప్పుడు, ప్రమాదం జరిగిన ఒక రోజు తర్వాత, ముషీర్ ఖాన్ స్వయంగా తన ఆరోగ్యం గురించి సమాచారాన్ని పంచుకున్నారు. కారు ప్రమాదం తర్వాత తన పరిస్థితి గురించి ముషీర్ ఖాన్ మాట్లాడుతూ, ‘నాకు ఈ కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. ప్రమాద సమయంలో నాతో ఉన్న నాన్న కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. మీ ప్రార్థనలకు చాలా ధన్యవాదాలు.

ఇదే ప్రమాదంలో గాయపడిన ముషీర్ తండ్రి నౌషాద్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు ముందుగా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో, మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ, మా శ్రేయోభిలాషులకు, మా అభిమానులకు ధన్యవాదాలు. ముషీర్‌పై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్న మా ఎంసీఏ, బీసీసీఐలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మీ ప్రార్థనలకు ధన్యవాదాలు..

కాగా ఇరానీ కప్ కోసం ముషీర్ ఖాన్ అజంగఢ్‌లోని తన ఇంటికి వచ్చారు. ఆ తర్వాత మ్యాచ్ ఆడేందుకు లక్నో వెళ్లాడు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన ముషీర్ ఖాన్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. ఈ తరుణంలో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ముషీర్ ఖాన్ గాయపడటం ముంబై జట్టుకు పెద్ద ఎదురు దెబ్బేనని భావించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్