AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరడం ఇంత కష్టమా.. హార్దిక్ సేన ముందున్న అడ్డు ఏంటో తెలుసా..?

Mumbai Indians Playoff Scenarios: ఐపీఎల్ పదమూడేళ్ల చరిత్రలో ముంబై ఇండియన్స్ ఎప్పుడూ లేనంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆరంభంలో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఐదుసార్లు ఛాంపియన్ జట్టు, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే అద్భుతం చేయాల్సిందే. హార్దిక్ పాండ్య సారథ్యంలోని ఈ జట్టుకు నాకౌట్ చేరడానికి ఉన్న అవకాశాలు, గణాంకలను ఓసారి చూద్దాం..

IPL 2026: ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరడం ఇంత కష్టమా.. హార్దిక్ సేన ముందున్న అడ్డు ఏంటో తెలుసా..?
Mumbai Indains
Venkata Chari
|

Updated on: Apr 21, 2026 | 6:50 AM

Share

Mumbai Indians Playoff Scenarios: ముంబై ఇండియన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన, ఆదరణ కలిగిన జట్టు. 2013 నుంచి 2020 మధ్య కాలంలో ఐదుసార్లు ట్రోఫీని కైవసం చేసుకున్న ఈ జట్టు, గత ఐదు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ ఏడాది ఆడిన మొదటి ఐదు మ్యాచ్‌లలో నాలుగు ఓటములతో ముంబై అభిమానులను నిరాశపరిచింది. నాయకత్వ మార్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, గతంలో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి గెలిచి ఛాంపియన్‌గా నిలిచిన చరిత్ర ముంబైకి ఉంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్ నుంచి ముంబై తన విజయయాత్రను మళ్ళీ ప్రారంభించాల్సి ఉంటుంది.

ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లు ఎన్ని..?

ఐపీఎల్ టోర్నమెంట్‌లో ప్లేఆఫ్స్ స్థానాన్ని సురక్షితం చేసుకోవాలంటే ఒక జట్టుకు కనీసం పదహారు పాయింట్లు అవసరం. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ స్థితిని గమనిస్తే, వారు మిగిలి ఉన్న తొమ్మిది మ్యాచ్‌లలో కనీసం ఏడు మ్యాచ్‌లలో విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎనిమిది మ్యాచ్‌లు గెలిస్తే ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. అయితే, ఏడు కంటే తక్కువ విజయాలు నమోదైతే మాత్రం ఇతర జట్ల ఓటమిపై ఆధారపడాల్సి వస్తుంది.

ఇతర జట్లపై ఆధారపడకుండా ఉండాలంటే..

ఒకవేళ ముంబై జట్టు మిగిలిన తొమ్మిది మ్యాచ్‌లలో ఆరు మాత్రమే గెలిస్తే ఖాతాలో పద్నాలుగు పాయింట్లు చేరుతాయి. అటువంటి సమయంలో నెట్ రన్ రేట్, ఇతర జట్ల పాయింట్ల పట్టిక కీలకంగా మారుతుంది. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి పటిష్టమైన జట్లతో ముంబై తలపడాల్సి ఉంది. ఈ పోరాటం అంత సులభం కాదు. దీనికంటే ముందు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌పై పైచేయి సాధించి ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకోవడం ముంబైకి ఎంతో అవసరం. ప్రతి మ్యాచ్ ఇప్పుడు ముంబైకి ఫైనల్‌తో సమానం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us