AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranji Trophy: ఆడేది 200వ మ్యాచ్.. కట్‌చేస్తే.. సెంచరీతో దుమ్ము రేపిన ముంబై కెప్టెన్

Ajinkya Rahane Century: హర్యానాతో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో ముంబై కెప్టెన్ అజింక్య రహానే అద్భుతమైన సెంచరీ సాధించాడు. తన 200వ ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో 108 పరుగులు చేసిన రహానే, సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ముంబై మొదటి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన తర్వాత, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన పోరాటంతో హర్యానాపై భారీ ఆధిక్యం సాధించింది.

Ranji Trophy: ఆడేది 200వ మ్యాచ్.. కట్‌చేస్తే.. సెంచరీతో దుమ్ము రేపిన ముంబై కెప్టెన్
Ajinkya Rahane Century
Venkata Chari
|

Updated on: Feb 11, 2025 | 1:09 PM

Share

Ajinkya Rahane Century: హర్యానాతో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో ముంబై కెప్టెన్ అజింక్య రహానే సెంచరీ సాధించి సత్తా చాటాడు. మంగళవారం, రహానె 160 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. దీంతో ముంబై ఆధిక్యాన్ని 88 పరుగుల నుంచి 353 పరుగులకు చేర్చుకుంది. రహానే మొదటి సెషన్‌లో తన 41వ ఫస్ట్-క్లాస్ సెంచరీని సాధించాడు. ఇది రహానేకి 200వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్. ఈ ప్రత్యేక మ్యాచ్‌ను సెంచరీతో స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. రహానే సెంచరీ ఆధారంగా ముంబై హర్యానాకు 354 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

రహానే వికెట్‌ను అనుజ్ థక్రాల్ తీసుకున్నాడు. రహానే 180 బంతుల్లో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు కొట్టాడు. ఈ రంజీ ట్రోఫీ సీజన్‌లో ఇది అతని తొలి సెంచరీ కూడా. ముంబై కెప్టెన్ భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి 129 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. ఆల్ రౌండర్ శివం దూబే 48 పరుగులు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 339 పరుగులకు ఆలౌట్ అయింది.

ఉత్కంఠభరితమైన మ్యాచ్..

దీనికి ముందు ముంబై తమ ఇన్నింగ్స్‌లో 315 పరుగులు చేసింది. స్టార్ బ్యాట్స్‌మెన్ విఫలమైన తర్వాత, షమ్స్ ములాని, తనుష్ కోటియన్ కలిసి ముంబైని మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 113 పరుగుల పేలవమైన స్థితి నుంచి 315 పరుగులకు తీసుకెళ్లారు. ములాని 91 పరుగులు, కోటియన్ 97 పరుగులు చేశారు. ఆ తర్వాత బౌలర్లు ముంబైని తిరిగి మ్యాచ్‌లోకి తీసుకువచ్చారు. శార్దూల్ ఠాకూర్ 6 వికెట్లు తీసి హర్యానాను చిత్తు చేశాడు. మొత్తం జట్టును 301 పరుగులకు ఆలౌట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగుల ఆధిక్యం సాధించిన ముంబై, రెండో ఇన్నింగ్స్‌లో 315 పరుగులు చేసింది. టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ మొదటి ఇన్నింగ్స్ తప్పును పునరావృతం చేయకుండా దోహదపడ్డారు. సిద్ధేష్ లాడ్ 43 పరుగులు, రహానే 108 పరుగులు, సూర్య 70 పరుగులు, దూబే 48 పరుగులు చేయడంతో మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..