AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ధోని ముందు కుప్పిగంతులా? మెరుపు వేగంతో రాజపక్సేను ఎలా రనౌట్‌ చేశాడో మీరే చూడండి..

MS Dhoni in CSK vs PBKS Match : టీమిండియా మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోని చాలాకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

IPL 2022: ధోని ముందు కుప్పిగంతులా? మెరుపు వేగంతో రాజపక్సేను ఎలా రనౌట్‌ చేశాడో మీరే చూడండి..
Ms Dhoni
Basha Shek
|

Updated on: Apr 03, 2022 | 9:25 PM

Share

MS Dhoni in CSK vs PBKS Match : టీమిండియా మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోని చాలాకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇక ఈ ఐపీఎల్‌ సీజన్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ షాక్‌కి గురి చేశాడు. అయితే నాన్ కెప్టెన్‌గా కేకేఆర్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ కొట్టాడు. ఆతర్వాత లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 6 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసి, మెరుపులు మెరిపించాడు. అలా పంజాబ్ కింగ్స్ (CSK vs PBKS) తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు వేగంతో భానుక రాజపక్సేని ఔట్‌ చేసి పాత ధోనిని మళ్లీ గుర్తు చేశాడు మిస్టర్‌ కూల్‌. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో జోర్డాన్ వేసిన మొదటి బంతికే భారీ సిక్సర్ కొట్టిన రాజపక్సే, తర్వాతి బంతిని షార్ట్ మిడ్ వికెట్ వైపుకు కొట్టి పరుగు కోసం క్రీజు వదిలిపెట్టి ముందుకు వచ్చాడు. అయితే ధావన్‌ వద్దనడంతో మళ్లీ వెనక్కు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈలోపు జోర్డాన్‌ బంతిని అందుకుని వికెట్లకు దూరంగా విసిరాడు. అయితే వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకున్న ఎమ్మెస్ ధోనీ, మెరుపు వేగంతో వికెట్లను గిరాటేశాడు. ఆ సమయానికి క్రీజుకు ఇంకా అడుగు దూరంలో ఉన్న రాజపక్సే నిరాశగా పెవిలియన్‌కు చేరుకోవాల్సి వచ్చింది.

పాత ధోనిని చూస్తున్నాం!

కాగా 40 ఏళ్లు దాటినా చిరుతలా దూకి రనౌట్‌ చేసిన ధోనిపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘మునపటి ధోనిని చూస్తున్నాం’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా మహేంద్ర సింగ్ ధోనీకి ఇది టీ20 కెరీర్‌లో 350వ మ్యాచ్ కావడం మరో విశేషం. ఈ మ్యాచ్‌ ద్వారా రోహిత్ శర్మ (372) తర్వాత అత్యధిక టీ20 మ్యాచులు ఆడిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు ఎమ్మెస్ ధోనీ.

Also Read: Train Accident: నాసిక్‌లో తప్పిన పెను ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు.. కొనసాగుతున్న సహాయకచర్యలు

AC Side Effects: ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.. అయితే, జాగ్రత్త.. ఈ 7 వ్యాధుల బారిన పడే ఛాన్స్..

Mehreen Kaur Pirzada: అందాలతో అదరగొడుతున్న పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా