CSK Vs RCB: ఈ 11 మంది ఆటగాళ్లు బరిలోకి దిగితే ఆర్సీబీ రాత మారినట్టే.. ట్రోఫీ బెంగళూరుదే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే ఆ కిక్కే వేరప్పా. ఈ ఏడాది డబ్ల్యూపీఎల్ ఛాంపియన్‌గా ఆర్సీబీ విమెన్స్ టీం నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అదే మోటివేషన్‌తో ఐపీఎల్‌లో ఆర్సీబీ మెన్స్ జట్టు కప్పు కొట్టాలని తహతహలాడుతోంది. 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని చూస్తోంది. మరి ఆ స్టోరీ ఏంటో చూసేద్దామా..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే ఆ కిక్కే వేరప్పా. ఈ ఏడాది డబ్ల్యూపీఎల్ ఛాంపియన్‌గా ఆర్సీబీ విమెన్స్ టీం నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అదే మోటివేషన్‌తో ఐపీఎల్‌లో ఆర్సీబీ మెన్స్ జట్టు కప్పు కొట్టాలని తహతహలాడుతోంది. 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని చూస్తోంది. గత సీజన్లతో పోలిస్తే.. ఈ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పటిష్టంగా ఉంది. హార్డ్ హిట్టర్లతో జట్టంతా నిండిపోయింది. అయితే ప్లేయింగ్ ఎలెవన్ దగ్గరకు వచ్చేసరికి.. ఎవరు తుది జట్టులో ఉంటారన్నదే ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.
చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్న ఆర్సీబీకి.. ప్లేయింగ్ ఎలెవన్ కూర్పు పెద్ద తలనొప్పిగా మారింది. ఇందులో భాగంగానే అత్యుత్తమ స్ట్రైక్‌రేట్ ఉన్న ఆటగాడిని బెంచ్‌పై కూర్చోపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఐపీఎల్ రూల్ బుక్ ప్రకారం, ప్రతీ జట్టులోని ప్లేయింగ్ ఎలెవన్‌లో కేవలం 4 మంది విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలి. ఇలాంటి తరుణంలో మెరుగైన స్ట్రైక్ రేట్ ఉన్నప్పటికీ, విల్ జాక్వెస్‌కి తుది జట్టులో చోటు దక్కదు.
టీ20లో ఓపెనర్‌గా ఉన్న విల్ జాక్వెస్.. ఇప్పటివరకు 163.2 స్ట్రైక్ రేట్‌తో కొనసాగుతున్నాడు. గత ఏడాది ఓపెనింగ్‌లో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ 126.1 కాగా, ఫాఫ్ డుప్లెసిస్ 139.9గా ఉంది. మరోసారి వీరిద్దరే ఓపెనింగ్ దిగబోతుండగా.. విల్ జాక్వెస్ బెంచ్‌కే పరిమితమవుతాడు. టాప్ ఆర్డర్ విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ చూసుకుంటే.. మిడిలార్డర్‌లో రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్ మెరుపులు మేరిపిస్తాడు. గ్రీన్ ఆర్సీబీకి అత్యంత ఖరీదైన ఆటగాడు. రూ. 17 కోట్లు వెచ్చించి అతడ్ని వేలంలో కొనుగోలు చేసింది బెంగళూరు. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే, పేస్ అటాక్‌ను మహ్మద్ సిరాజ్ సారధ్యం వహించనుండగా.. అతడికి ఆకాశ్ దీప్, యశ్ దయాల్ సహకారం అందిస్తారు. ఇక విదేశీ బౌలర్ కోటాలో రీస్ టాప్లీ.. స్పిన్నర్‌గా కరన్ శర్మ బరిలోకి దిగుతారు.
RCB ప్లేయింగ్ XI(అంచనా)
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, కరన్ శర్మ, రీస్ టాప్లీ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ఆకాశ్ దీప్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం..




