T20 World Cup 2021: అండర్-19, టీ20, వన్డే వరల్డ్ కప్ గెలిచిన వారు ముగ్గురున్నారు.. అందులో ఒకరు యువరాజ్ సింగ్.. మిగతా ఇద్దరు ఎవరంటే..
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించిన ప్రపంచ కప్ గెలిచింది. అయితే ఈ వరల్డ్ కప్ గెలవడంతో ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ అరుదైన ఘనత సాధించారు...
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించిన ప్రపంచ కప్ గెలిచింది. అయితే ఈ వరల్డ్ కప్ గెలవడంతో ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ అరుదైన ఘనత సాధించారు. మూడు రకాల ఫార్మట్లలో వరల్డ్ కప్ గెలిచిన ఆటగాళ్ల సరసన చేరారు. ఇంతకు ముందు అండర్-19, వన్డే, టీ20 గెలిచిన వారి భారత్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు వీరిద్దరు యువరాజ్ సింగ్ సరసన చేరారు. మార్ష్, హేజిల్‌వుడ్ 2010లో ఆస్ట్రేలియా U-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్నారు. మైకేల్ క్లార్క్ నేతృత్వంలోని సొంతగడ్డపై 2015 వన్డే ప్రపంచ కప్ సాధించిన జట్టులో మార్ష్, హేజిల్‌వుడ్ ఉన్నారు. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. యువరాజ్ సింగ్ 2000లో అండర్-19 వరల్డ్ కప్ గెచిన జట్టు సభ్యుడిగా ఉన్నాడు. 2007 టీ20 వరల్డ కప్ గెలిచిన జట్టులో కూడా ఆటగాడిగా ఉన్నాడు. 2011 ప్రపంచ కప్‌ను గెలిచిన జట్టులో యువరాజ్ సింగ్ సభ్యుడిగా ఉన్నాడు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. హేజిల్‌వుడ్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లు వేసి కేవలం 16 పరుగులే ఇచ్చాడు. దీంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ 48 బంతుల్లో 85 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ నాలుగు ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. కమ్మిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మూడో ఓవర్లోనే ఫించ్ వికెట్ కోల్పోయింది. వార్నర్ 38 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అనంతరం మార్ష్, మ్యాక్స్‌వెల్ జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఆస్ట్రేలియా ఐదు వన్డే ప్రపంచ కప్‌లు (1987, 1999, 2003, 2007, 2015 ) గెలిచింది. రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు (2006, 2009) కూడా సాధించింది.
Read Also.. T20 World Cup 2021: బాబర్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఇవ్వకపోవడంపై షోయబ్ అక్తర్ అసంతృప్తి.. ఇదేమిటంటూ ట్వీట్..