Video: 11 ఫోర్లు, 10 సిక్సర్లు.. 49 బంతుల్లోనే ఊచకోత.. ఊరమాస్ ఇన్నింగ్స్‌తో చరిత్రనే చించేశాడుగా..

Michael Levitt Century: చివరి ఓవర్‌లో తేజ నిడమూరు 3 బంతుల్లో 600 స్ట్రైక్ రేట్‌తో 18 పరుగులు చేశాడు. ఎంగిల్‌బ్రెచ్ట్, లెవిట్ మధ్య రెండో వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యం ఉంది. 15 పరుగుల స్కోరుపై నెదర్లాండ్స్‌కు తొలి దెబ్బ తగిలింది. కానీ, ఆ తర్వాత లెవిట్, ఇంగ్లెబ్రెట్ లు తుఫాను బ్యాటింగ్ చేసి 18వ ఓవర్లో జట్టు స్కోరును 200 దాటించారు. దీని తర్వాత లెవిట్ తన సెంచరీ పూర్తి చేసి 135 పరుగుల ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయ్యాడు.

Video: 11 ఫోర్లు, 10 సిక్సర్లు.. 49 బంతుల్లోనే ఊచకోత.. ఊరమాస్ ఇన్నింగ్స్‌తో చరిత్రనే చించేశాడుగా..
Michael Levitt

Updated on: Mar 01, 2024 | 1:09 PM

Michael Levitt Century: నేపాల్ వేదికగా జరుగుతున్న ట్రై నేషన్ టీ20 సిరీస్‌లో నెదర్లాండ్స్, నమీబియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 247 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌ తరపున 20 ఏళ్ల బ్యాట్స్‌మెన్‌ మైకేల్‌ లెవిట్‌ సెంచరీ చేశాడు. కేవలం 49 బంతుల్లోనే లెవిట్ తొలి టీ20 సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ టీ20లో సెంచరీ చేసిన నెదర్లాండ్స్‌కు చెందిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతనికి ముందు, మాక్స్ ఓ’డౌడ్ కూడా 2021లో మలేషియాపై సెంచరీ సాధించాడు. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా నిలిచింది. తాజాగా ఈ ప్లేయర్ దెబ్బకు రికార్డులు మారిపోయాయి.

మైఖేల్ లెవిట్ 62 బంతుల్లో 135 పరుగులు చేసి ఔటయ్యాడు. అతను 217 స్ట్రైక్ రేట్ వద్ద పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన ఈ యువ బ్యాట్స్‌మెన్ 11 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. అంటే లెవిట్ 21 బంతుల్లో ఏకంగా ఫోర్లు, సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. లెవిట్‌తో పాటు, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ కూడా నెదర్లాండ్స్ తరఫున హాఫ్ సెంచరీ చేశాడు. 40 బంతుల్లో 75 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇంగ్లెబ్రెట్ 5 సిక్సర్లు, 7 ఫోర్లు కొట్టాడు.

ఇవి కూడా చదవండి

చివరి ఓవర్‌లో తేజ నిడమూరు 3 బంతుల్లో 600 స్ట్రైక్ రేట్‌తో 18 పరుగులు చేశాడు. ఎంగిల్‌బ్రెచ్ట్, లెవిట్ మధ్య రెండో వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యం ఉంది. 15 పరుగుల స్కోరుపై నెదర్లాండ్స్‌కు తొలి దెబ్బ తగిలింది. కానీ, ఆ తర్వాత లెవిట్, ఇంగ్లెబ్రెట్ లు తుఫాను బ్యాటింగ్ చేసి 18వ ఓవర్లో జట్టు స్కోరును 200 దాటించారు. దీని తర్వాత లెవిట్ తన సెంచరీ పూర్తి చేసి 135 పరుగుల ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయ్యాడు. నెదర్లాండ్స్ బ్యాట్స్‌మెన్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. కాగా, నెదర్లాండ్స్ 247 పరుగులు చేసింది. టీ20లో జట్టుకు ఇదే అతిపెద్ద స్కోరుగా నిలిచింది.

అంతకుముందు, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా బ్యాట్స్‌మెన్ జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ 36 బంతుల్లో 101 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీగా నిలిచింది. ఈ ఇన్నింగ్స్‌లో లాఫ్టీ ఈటన్ 8 సిక్సర్లు, 11 ఫోర్లు కొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..