Video: హిట్‌మ్యాన్ ఔట్‌తో కల్యాణ్ రామ్ హీరోయిన్ రచ్చరచ్చ.. మతిపోయే ఎక్స్‌ ప్రెషన్స్‌తో ఫిదా..

Rohit Sharma: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గుజరాత్ టైటాన్స్‌పై మరోసారి తన బ్యాటింగ్ వైఫల్యాన్ని నిరూపించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా 56వ మ్యాచ్ ముంబైలోని వాంఖడేలో ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది.

Video: హిట్‌మ్యాన్ ఔట్‌తో కల్యాణ్ రామ్ హీరోయిన్ రచ్చరచ్చ.. మతిపోయే ఎక్స్‌ ప్రెషన్స్‌తో ఫిదా..
Rohit Sharma Saiee Manjreka

Updated on: May 07, 2025 | 1:29 PM

Rohit Sharma: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గుజరాత్ టైటాన్స్‌పై మరోసారి తన బ్యాటింగ్ వైఫల్యాన్ని నిరూపించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా 56వ మ్యాచ్ ముంబైలోని వాంఖడేలో ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఇందులో, గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ టాస్ గెలిచి ఆతిథ్య ముంబై ఇండియన్స్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఎంఐ ఇన్నింగ్స్‌ను ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ మరోసారి బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. అతను 8 బంతుల్లో 7 పరుగులే చేశాడు. కానీ, అతను అవుట్ అయినప్పుడు, నటుడు సల్మాన్ ఖాన్‌తో ప్రత్యేక సంబంధం ఉన్న ఒక అందమైన మహిళ ఊపిరి ఆగిపోయేలా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

రోహిత్ వికెట్ పడిపోవడంతో..

ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు వచ్చాడు. వాంఖడేలోని ప్రేక్షకులు భారీ ఇన్నింగ్స్‌ను ఆశించారు. కానీ, మరోసారి రోహిత్ బ్యాట్ మౌనంగా ఉండిపోయింది. రోహిత్ మరోసారి ఎడమ చేయి పేసర్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఈసారి అతని కోసం గుజరాత్ టైటాన్స్ యువ పేసర్ అర్షద్ ఖాన్ రంగంలోకి దిగాడు.

ఇవి కూడా చదవండి

రోహిత్ వికెట్ పడినప్పుడు, మైదానంలో నిశ్శబ్దం ఆవరించింది. ముంబై ఇండియన్స్‌కు మద్దతు ఇవ్వడానికి వచ్చిన నటి సాయి మంజ్రేకర్ కూడా నిరాశ చెందింది. సాయి మంజ్రేకర్ దబాంగ్ 3 లో సల్మాన్ ఖాన్ తో కలిసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అలాగే, తెలుగులోనూ నటించింది. ఇటీవల కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన సన్ ఆఫ్ వైజయంతి సినిమాలోనూ ఆకట్టుకుంది.

సాయి మంజ్రేకర్ ఎక్స్‌ప్రెషన్స్ వైరల్..

రోహిత్ శర్మ ఔట్ తర్వాత సాయి మంజ్రేకర్ ఇచ్చిన షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, రోహిత్ శర్మ వికెట్ పడగొట్టిన తర్వాత, గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా వికెట్ పడగొట్టడాన్ని ఎంతో ఉత్సాహంగా పెలబ్రేట్ చేసుకున్నాడు. ఎందుకంటే, రోహిత్ అదే మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై 76 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం ద్వారా మ్యాచ్ గమనాన్ని మార్చాడు. రోహిత్ వికెట్ పడకుండా ఉంటే, మొత్తం మ్యాచ్‌ను ముంబైకి అనుకూలంగా మార్చగలిగేవాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..