AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే క్యాచ్.. మెరుపువేగంతో క్షణాల్లోనే మాయ చేశారుగా.. ఔరా అనాల్సిందే..

Mark Chapman and Daryl Mitchell magic catch: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతోన్న మ్యాచ్‌లో యూఏఈ జట్టు టాస్ గెలిచి, ముందుగా బ్యాటింగ్ చేసి, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. అయితే, కివీస్ ప్లేయర్ మార్క్ చాప్ మన్ పట్టిన ఓ క్యాచ్ సంచలనంగా మారింది.

Video: బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే క్యాచ్.. మెరుపువేగంతో క్షణాల్లోనే మాయ చేశారుగా.. ఔరా అనాల్సిందే..
Mark Chapman And Daryl Mitchellmagic Catch
Venkata Chari
|

Updated on: Feb 10, 2026 | 4:53 PM

Share

NZ vs UAE: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు చెన్నైలో న్యూజిలాండ్ వర్సెస్ యూఏఈ జట్లు తలపడుతున్నాయి. అయితే, టాస్ గెలిచిన యూఏఈ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తున్నారు. అనుభవం లేని జట్టుగా బరిలోకి వచ్చిన యూఏఈ న్యూజిలాండ్ జట్టు ముందు భారీ టార్గెట్ ఉంచేందుకు సిద్ధమవుతోంది. అయితే ఆదిలోనే వికెట్ కోల్పోయినా.. ఏమాత్రం వెనక్కి తగ్గని యూఏఈ బ్యాటర్లు మహ్మద్ వాసిం, అలిషాన్ షరఫ్ సెంచరీ భాగస్వామ్యంతో చుక్కలు చూపించారు. హాఫ్ సెంచరీతో డేంజరస్ గా మారుతోన్న అలిషాన్ షరఫ్ (55)ను అద్భుత క్యాచ్ తో పెవిలియన్ చేర్చారు డారెల్ మిచెల్, మార్క్ చాప్ మన్. ఈ కళ్లు చెదిరే క్యాచ్ లో కీలక వ్యక్తి మార్క్ చాప్ మన్. ఎందుకంటే, బౌండరీ వెళ్తున్న బంతిని అమాంతం గాల్లోకి ఎగిరి రెండు చేతులతో పట్టుకుని, బౌండరీ లైన్ దాటేమందు చాకచక్యంగా డారెల్ మిచెల్ కు అందించాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

మ్యాచ్ పరిస్థితి..

న్యూజిలాండ్ కు యూఏఈ 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ICC (@icc)

కెప్టెన్ మహ్మద్ వసీం 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. అలీషాన్ షరాఫు 55 పరుగులు సాధించాడు. మయాంక్ కుమార్ 21 పరుగులు చేశాడు. మాట్ హెన్రీ రెండు వికెట్లు పడగొట్టాడు. జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ తలా ఒక వికెట్ తీశారు.

రెండు జట్ల ప్లేయింగ్-11..

యూఏఈ: ఆర్యన్ష్ శర్మ, మహ్మద్ వసీం (కెప్టెన్), అలీషాన్ షరాఫు, మయాంక్ కుమార్, సోహైబ్ ఖాన్, హర్షిత్ కౌశిక్, మహ్మద్ అర్ఫాన్, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, జునైద్ సిద్ధిఖీ, మహ్మద్ రషీద్ ఖాన్.

న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జిమ్మీ నీషమ్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..