- Telugu News Sports News Cricket news Mahira Sharma Mother Denies Dating Rumors about Cricketer Mohammed Siraj
Mohammed Siraj: సిరాజ్, మహిరా శర్మ రిలేషన్‌లో ఉన్నారా.. ఎట్టకేలకు మౌనం వీడిన నటి తల్లి.. ఏమన్నారంటే?
Mohammed Siraj and Mahira Sharma Dating Rumors: భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్, టీవీ నటి మహిరా శర్మ డేటింగ్ గురించి వస్తున్న వార్తలపై మహిరా తల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం పుకార్లు మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. ముందుగా మహిరా పరాస్ ఛబ్రాతో సంబంధం కలిగి ఉండేదని, తరువాత వారు విడిపోయారని తెలిపారు. సిరాజ్ సోషల్ మీడియాలో మహిరా పోస్టులను లైక్ చేయడం వల్ల ఈ పుకార్లు వచ్చాయని భావిస్తున్నారు.
Updated on: Jan 31, 2025 | 11:13 AM

Mahira Sharma Denies Dating Mohammed Siraj: గతకొంత కాలంగా భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్, టీవీ నటి మహిరా శర్మ ఇద్దరూ ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మహ్మద్ సిరాజ్‌కి, మహిరా శర్మకు ఉన్న సంబంధం గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు.

మహ్మద్ సిరాజ్, మహిరా శర్మ ఇద్దరూ ఈ సంబంధంపై మౌనం వహిస్తున్నారు. అయితే, ఇప్పుడు టీవీ నటి మహిరా శర్మ తల్లి ఈ విషయంపై మౌనం వీడింది. ఈ సంబంధం గురించి అసలు విషయాలు వెల్లడించింది. మహీరా శర్మ తల్లి ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం..

మహిరా శర్మ తల్లి ఈ సంబంధానికి సంబంధించిన వాస్తవాన్ని పేర్కొంటూ డేటింగ్ పుకార్లను కొట్టిపారేసింది. నటి తల్లి ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఈరోజుల్లో ఏదన్నా మాట్లాడతారు. నా కూతురు సెలబ్రిటీ కాబట్టి ఆమె పేరును ఎవరితోనైనా ముడిపెడతారు. అలాంటి వాళ్లను నమ్మాలా? అంటూ డేటింగ్ గురించి అన్ని చర్చలను తిరస్కరించింది.

నటి తల్లి సానియా శర్మ డేటింగ్ పుకార్లను పూర్తిగా అబద్ధం అని కొట్టిపారేసింది. మహీరా ఇంతకు ముందు పరాస్ ఛబ్రాతో సంబంధంలో ఉందని వార్తలు వచ్చాయి. వారిద్దరూ మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఆ తర్వాత 2023లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. సిరాజ్‌తో డేటింగ్‌పై వస్తున్న వార్త పూర్తిగా అవాస్తవమని తల్లి సానియా శర్మ పేర్కొంది.

వాస్తవానికి, కొన్ని రోజుల క్రితం మహమ్మద్ సిరాజ్ మహిరా శర్మ పోస్ట్‌ను లైక్ చేశాడు. దాని కారణంగా వీరిద్దరి పేర్లు ఒకదానితో లింక్ చేయడం ప్రారంభించారు. జనై భోంస్లే, మహ్మద్ సిరాజ్ మధ్య సంబంధం క్లియర్ అయిన తర్వాత, మహ్మద్ సిరాజ్, మహిరా శర్మ మధ్య సంబంధం మళ్లీ ముఖ్యాంశాలలోకి వచ్చింది. మహీరా శర్మ, మహ్మద్ సిరాజ్ గత రెండేళ్లుగా ఒకరితో ఒకరు డేటింగ్‌లో ఉన్నారని కొన్ని మీడియా నివేదికలలో కూడా పేర్కొంది. అయితే, మహిరా శర్మ తల్లి ప్రకారం, ఈ వార్త కేవలం పుకారు మాత్రమేనని తేలింది.




