
IPL Mini Auction 2023, CSK: ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అత్యంత విజయవంతమైనవిగా పేరుగాంచాయి. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకోగా, మహేంద్ర సింగ్ ధోనీ జట్టు 4 సార్లు ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మినహా దాదాపు అన్ని జట్లూ వేలంపై కన్నేశాయి. ఐపీఎల్ మినీ వేలం 2023 డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. అదే సమయంలో, ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆల్ రౌండర్లలో ఒకరైన డ్వేన్ బ్రావో రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో వేలంలో ఆల్ రౌండర్ ఆటగాళ్లపై మహేంద్ర సింగ్ ధోనీ బృందం ఓ కన్నేసి ఉంచనుంది.
IPL వేలం 2023లో, మహేంద్ర సింగ్ ధోని జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్‌పై కన్నేసింది. డ్వేన్ బ్రావో రిటైర్మెంట్ తర్వాత, CSK ఈ ఆటగాడిపై భారీగా పోటీ పడేందుకు సిద్ధమైంది. 2022 టీ20 ప్రపంచ కప్‌లో, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ చాలా ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ తన సత్తా చాటాడు. ఇది కాకుండా సామ్ కుర్రాన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఇప్పటికే ఆడాడు. CSK IPL వేలం 2020లో శామ్ కుర్రాన్‌ను రూ. 5.5 కోట్లకు చేర్చింది.
IPL వేలం 2023లో సామ్ కుర్రాన్ బేస్ ధర రూ. 2 కోట్లుగా నిలిచింది. అయితే సామ్ కుర్రాన్ ఆల్ రౌండర్ సత్తా కారణంగా వేలంలో భారీ మొత్తం దొరుకుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఐపీఎల్‌లో సామ్ కుర్రాన్ గణాంకాలను పరిశీలిస్తే, ఈ ఆటగాడు ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 32 మ్యాచ్‌ల్లో ఈ ఆల్‌రౌండర్ 337 పరుగులు చేశాడు. ఇది కాకుండా, కొత్త బంతితోనే కాకుండా డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయడంలో సామ్ కుర్రాన్ ప్రసిద్ధి చెందాడు. ఇటీవల, సామ్ కర్రన్ 2022 టీ20 ప్రపంచకప్‌లో 13 వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఈ ఆల్‌రౌండర్ 4 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి ముగ్గురు ఆటగాళ్లను పెవిలియన్ చేర్చాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనకు, ఫైనల్‌లో సామ్ కర్రాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అలాగే పాకిస్థాన్‌ను ఓడించి ఇంగ్లండ్ రెండోసారి ఈ టైటిల్‌ను గెలుచుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..