AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG vs MI Highlights, IPL 2022 : ముంబై 20 ఓవర్లకి 132/8.. 36 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం

Lucknow Super Giants vs Mumbai Indians Highlights: ఐపీఎల్‌ 2022 (IPL 2022) సగం టోర్నీ ముగిసింది. అయితే ఇప్పటికీ ఒక్క మ్యాచ్‌లో కూడా విజయాన్ని అందుకోక సతమతమవుతోంది ముంబై ఇండియన్స్‌...

LSG vs MI Highlights, IPL 2022 : ముంబై 20 ఓవర్లకి 132/8.. 36 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం
Lsg Vs Mi
uppula Raju
|

Updated on: Apr 25, 2022 | 12:01 AM

Share

Lucknow Super Giants vs Mumbai Indians Highlights:ముంబై పై లక్నో 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. వరుసగా ఏడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థాయిలో నిలిచింది. లక్నో జట్టుకి ఏ పరిస్థితిలోను పోటీ ఇచ్చినట్లుగా కనిపించలేదు. రోహిత్‌ శర్మ 39, తిలక్‌ వర్మ 38 పరుగులు చేశారు. మిగతా వారు ఎవ్వరూ చెప్పుకోతగ్గ స్కోరు చేయలేదు. ఇక లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్య మూడు వికెట్లు పడగొట్టగా.. మోహ్‌సిన్ ఖాన్, హోల్డర్, రవి బిష్ణోయ్‌, బదోనీ తలో వికెట్ తీశారు. అంతకు ముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అయితే లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మరోసారి అద్భుత ఆటతీరును కనబరిచాడు. కేవలం 62 బంతుల్లోనే 103 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. మానీష్‌ పాండే 22 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.

ఇరు జట్ల ప్లేయింగ్- XI (అంచనా)..

లక్నో సూపర్ జెయింట్స్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, మనన్ వోహ్రా, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, క్రునాస్ పాండ్యా, జాసన్ హోల్డర్, దుష్మంత చమీరా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, హృతిక్ షోకిన్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్.

Key Events

ముంబైకి ప్రతికూల వాతావరణం..

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై 2022 సీజన్‌లో మాత్రం ఒక్క విషయాన్ని అందుకోలేదు. ముంబై జట్టుకు ఈసారి ప్రతికూల వాతావరణం ఉంది. దీంతో పాయింట్ల జాబితాలో చివరి స్థానంలో నిలిచింది.

లక్నో బలలు, బలహీనతలు..

ఇక లక్నో విషయానికొస్తే.. బ్యాటింగ్‌, బౌలింగ్‌లలో ఆ జట్టు బలంగానే కనిపిస్తోంది. అయితే వన్‌డౌన్‌ బ్యాటర్‌ మనీష్ పాండే ఫామ్‌ టీం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 24 Apr 2022 11:39 PM (IST)

    ముంబై 20 ఓవర్లకి 132/8.. లక్నోఘన విజయం

    ముంబై పై లక్నో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో జట్టుకి ఏ పరిస్థితిలోను పోటీ ఇచ్చినట్లుగా కనిపించలేదు. రోహిత్‌ శర్మ 39, తిలక్‌ వర్మ 38 పరుగులు చేశారు. మిగతా వారు ఎవ్వరూ చెప్పుకోతగ్గ స్కోరు చేయలేదు.

  • 24 Apr 2022 11:31 PM (IST)

    ఆరో వికెట్‌ కోల్పోయిన ముంబై

    ముంబై ఇండియన్స్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. కీరన్‌ పొలార్డ్ 19 పరుగులు వద్ద ఔటయ్యాడు. కృనాల్‌ పాండ్య బౌలింగ్‌లో హుడా క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో ముంబై ఆరు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.

  • 24 Apr 2022 11:21 PM (IST)

    ఐదో వికెట్‌ కోల్పోయిన ముంబై

    ముంబై ఇండియన్స్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. తిలక్‌ వర్మ 38 పరుగులు వద్ద ఔటయ్యాడు. హోల్డర్‌ బౌలింగ్‌లో రవి బిష్ణోని క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో ముంబై ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 13 బంతుల్లో 45 పరుగులు చేయాలి.

  • 24 Apr 2022 11:13 PM (IST)

    31 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం

    తిలక్‌ వర్మ 34 పరుగులు, పొలార్డ్ 16 పరుగులతో ఆడుతున్నారు. ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కి 31 బంతుల్లో 50 పరుగులు జోడించారు. ముంబై విజయానికి ఇంకా 19 బంతుల్లో 50 పరుగులు చేయాల్సి ఉంది.

  • 24 Apr 2022 11:01 PM (IST)

    100 పరుగులు దాటిన ముంబై

    ముంబై 15.1 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 102 పరుగులు చేసింది. క్రీజులో తిలక్‌ వర్మ 27 పరుగులు, పొలార్డ్‌ 8 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 29 బంతుల్లో 67 పరుగులు చేయాల్సి ఉంది.

  • 24 Apr 2022 10:59 PM (IST)

    15 ఓవర్లకి ముంబై 98/4

    15 ఓవర్లకి ముంబై 4 వికెట్లు నష్టపోయి 98 పరుగులు చేసింది. క్రీజులో తిలక్‌ వర్మ 23 పరుగులు, పొలార్డ్‌ 8 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 30 బంతుల్లో 71 పరుగులు చేయాల్సి ఉంది.

  • 24 Apr 2022 10:38 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన ముంబై

    ముంబై ఇండియన్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. సూర్యకుమార్‌ యాదవ్ 7 పరుగులకే ఔటయ్యాడు. ఆయుష్‌ బదోని బౌలింగ్‌లో రాహుల్‌ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో ముంబై నాలుగు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. విజయానికి ఇంకా52 బంతుల్లో 102 పరుగులు చేయాల్సి ఉంది.

  • 24 Apr 2022 10:31 PM (IST)

    10 ఓవర్లకి ముంబై 59/3

    10 ఓవర్లకి ముంబై మూడు వికెట్లు నష్టపోయి 59 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్‌ యాదవ్ 2 పరుగులు, తిలక్‌ వర్మ 1 పరుగుతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 60 బంతుల్లో 110 పరుగులు చేయాల్సి ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌ బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్ 1, రవి బిషోని 1వికెట్‌, కృనాల్‌ పాండ్య 1 వికెట్‌ సాధించారు.

  • 24 Apr 2022 10:29 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన ముంబై

    ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. రోహిత్‌ శర్మ 39 పరుగులు చేసి ఔటయ్యాడు. కృనాల్‌ పాండ్య బౌలింగ్‌లో గౌతమ్‌ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో ముంబై మూడు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 62 బంతుల్లో 111 పరుగులు చేయాల్సి ఉంది.

  • 24 Apr 2022 10:20 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన ముంబై

    ముంబై ఇండియన్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. డెవాల్డ్ బ్రెవిస్ డకౌట్‌ అయ్యాడు. మోహ్‌సిన్ ఖాన్ బౌలింగ్‌లో చమీర క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో ముంబై రెండు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 69 బంతుల్లో 115 పరుగులు చేయాల్సి ఉంది.

  • 24 Apr 2022 10:17 PM (IST)

    50 పరుగులు దాటిన ముంబై

    ముంబై 8 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ 37 పరుగులు, డెవాల్డ్ బ్రెవిస్ 3 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 72 బంతుల్లో 115 పరుగులు చేయాల్సి ఉంది.

  • 24 Apr 2022 10:15 PM (IST)

    మొదటి వికెట్‌ కోల్పోయిన ముంబై

    ముంబై ఇండియన్స్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది. ఇషాన్‌ కిషన్‌ 8 పరుగులు చేసి ఔటయ్యాడు. రవి బిషోని బౌలింగ్‌లో హోల్డర్‌ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో ముంబై ఒక వికెట్‌ నష్టానికి 49 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 77 బంతుల్లో 120 పరుగులు చేయాల్సి ఉంది.

  • 24 Apr 2022 10:00 PM (IST)

    5 ఓవర్లకి ముంబై 31/0

    5 ఓవర్లకి ముంబై వికెట్‌ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ 20 పరుగులు, ఇషాన్‌ కిషన్ 5 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 90 బంతుల్లో 130 పరుగులు చేయాల్సి ఉంది.

  • 24 Apr 2022 09:20 PM (IST)

    రాహుల్‌ సూపర్‌ బ్యాటింగ్‌..

    రాహుల్‌ సెంచరీ మరోసారి అద్భుత ఆటతీరును కనబరిచాడు. ఇతర బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌ బాట పడుతోన్నా కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో రాణించాడు రాహుల్‌. 61 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్లర్‌లతో సెంచరీ పూర్తి చేశాడు.

  • 24 Apr 2022 08:59 PM (IST)

    మరో వికెట్ కోల్పోయిన లక్నో..

    లక్నో మరో వికెట్ కోల్పోయింది. రిలే మెరెడిత్ బౌలింగ్‌లో బ్రెవిస్‌కు క్యాచ్‌ ఇచ్చిన దీపక్‌ హుండా అవుట్‌ అయ్యాడు. దీంతో లక్నో 122 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయింది.

  • 24 Apr 2022 08:47 PM (IST)

    4 ఓవర్లకు జట్టు స్కోర్‌ ఎంతంటే..

    14 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో 108 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో దీపక్‌ హుండా (4), కేఎల్‌ రాహుల్‌ (65) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.

  • 24 Apr 2022 08:46 PM (IST)

    నాలుగో వికెట్‌ డౌన్‌..

    లక్నో సూపర్ జెయింట్స్‌ వరుస వికెట్లు కోల్పోతోంది. క్రునల్‌ పాండ్యా అవుట్‌ అయ్యాడు. పోలార్డ్‌ బౌలింగ్‌లో హృతిక్ షోకిన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు.

  • 24 Apr 2022 08:33 PM (IST)

    రెండో వికెట్‌ గాన్‌..

    లక్నో సూపర్‌ జెయింట్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 22 పరుగులు చేసిన మనీష్‌ పాండే.. పోలార్డ్‌ బౌలింగ్‌లో రిలే మెరెడిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో 85 పరగుఉల వద్ద కొనసాగుతోంది. రాహుల్‌ 52 పరుగులతో దూసుకుపోతున్నాడు.

  • 24 Apr 2022 08:28 PM (IST)

    రాహుల్‌ హాఫ్‌ సెంచరీ..

    గత కొన్ని రోజులుగా మంచి ఫామ్‌ను కనబరుస్తూ వస్తోన్న రాహుల్‌ ఈ మ్యాచ్‌లోనూ రాణించాడు. జట్టు స్కోరు పెంచే క్రమంలో 37 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో స్కోర్‌ 82 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 24 Apr 2022 07:53 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన లక్నో..

    టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగి లక్నో సూపర్‌ జెయింట్స్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చిన డికాక్‌ పెవిలియన్‌ బాట పట్టాడు.

  • 24 Apr 2022 07:08 PM (IST)

    ఇరు జట్ల ప్లేయింగ్- XI..

    లక్నో సూపర్ జెయింట్స్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, మనీష్‌ పాండే, క్రునల్‌ పాండ్యా, దీపక్‌ హుడా, ఆయుష్‌ బడోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, దుష్మంత చమీరా,మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్.

    ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, హృతిక్ షోకిన్, జయదేవ్ ఉనద్కత్, డేనియల్ సామ్స్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్.

  • 24 Apr 2022 07:04 PM (IST)

    టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌..

    ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉన్న ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపింది. డ్యూ ప్రభావం ఉండడం, వాంఖడే స్టేడియం చేజింగ్‌కు అనుకూలిస్తుండడంతో రోహిత్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. మరి ముంబై తీసుకున్న ఈ నిర్ణయం ఆ జట్టుకు ఏమేర ఉపయోగపడుతుందో చూడాలి.

  • 24 Apr 2022 06:50 PM (IST)

    ముంబై జట్టులో ఈ మార్పులు జరగొచ్చు..

    ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇషాన్‌ కిషన్‌, కీరన్ పొలార్డ్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. బౌలింగ్‌లో బుమ్రా ఒంటరిగా పోరాడుతున్నాడు. అందుకే ఈ మ్యాచ్లో పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చిన ఉనాద్కత్ పెవిలియన్‌కే పరిమితం కావొచ్చు. అతని స్థానంలో మరోసారి బాసిల్ థంపి జట్టులోకి రావొచ్చు. హృతిక్ షౌకిన్‌కు మరో అవకాశం ఇవ్వొచ్చు.

Published On - Apr 24,2022 6:39 PM