LSG vs KKR Score: మొదట్లో డికాక్, హుడా.. చివర్లో స్టోయినీస్, హోల్డర్ మెరుపులు.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్..

Lucknow Super Giants vs Kolkata Knight Riders:టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు సాధించింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 177 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

LSG vs KKR Score: మొదట్లో డికాక్, హుడా.. చివర్లో స్టోయినీస్, హోల్డర్ మెరుపులు.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్..
Ipl 2022, Lsg Vs Kkr
Follow us
Venkata Chari

|

Updated on: May 07, 2022 | 9:25 PM

LSG vs KKR Score: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 53వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌(Kolkata Knight Riders)తో లక్నో(Lucknow Super Giants) తలపడుతోంది. ఈ మ్యాచ్ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ముంబైలో జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు సాధించింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 177 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. లక్నో టీం తరపున డికాక్ 50(29 బంతులు, 4 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ పరుగులేమీ చేయకుండానే రనౌట్‌గా వెనుదిరిగాడు. దీపక్ హుడా 41, పాండ్యా 25, బదోని 15(నాటౌట్), స్టోయినీస్ 28, హోల్డర్ 13 పరుగులు చేశారు. ఇక కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ 2, సునీల్ నరైన్ 1, సౌథీ 1, శివం మావీ 1 వికెట్ పడగొట్టారు.

Also Read: Happy Mother’s Day: లక్నో టీం మదర్స్ డే స్పెషల్ అదిరిపోయిందిగా.. సలాం చేస్తోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో..

డికాక్ అద్భుత ఇన్నింగ్స్..

లక్నో ఓపెనర్ క్వింటన్ డి కాక్ 29 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 172.41గా నిలిచింది. డి కాక్ వికెట్‌ను సునీల్ నరైన్ తీశాడు.

ఇవి కూడా చదవండి

దీపక్ హుడా కూడా..

లక్నో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ ఆరంభంలోనే పతనమైనా, ఆ తర్వాత దీపక్ హుడా, డి కాక్‌లు లక్నో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 27 బంతుల్లో 41 పరుగులు చేసిన తర్వాత దీపక్‌ను రస్సెల్ అవుట్ చేశాడు. వీరిద్దరి మధ్య 39 బంతుల్లో 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

చివర్లో స్టోయినీస్ మెరుపులు..

చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన స్టోయినీస్ శివం మావీకి చుక్కలు చూపించాడు. వరుసగా మూడు సిక్సులు కొట్టి మాంచి ఊపులో కనిపించాడు. కానీ, ఆ తర్వాత బంతికే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో మొత్తం 14 బంతులు ఆడిన స్టోయినీస్ 3 సిక్సులు, 1 ఫోర్ సహాయంతో 28 పరుగులు చేశాడు.

ఇరు జట్లు:

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), కేఎల్ రాహుల్(కెప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని, జాసన్ హోల్డర్, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఆరోన్ ఫించ్, బాబా ఇంద్రజిత్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, రింకు సింగ్, అనుకుల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, శివమ్ మావి, హర్షిత్ రాణా

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022: ఆ స్టార్ ప్లేయర్‌కు పార్టీలు, గొడవలంటేనే ఇష్టం.. అందుకే జట్టు నుంచి తప్పించాం: వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

IPL 2022: జోస్‌ బట్లర్ ప్రత్యేక రికార్డ్‌.. ఆ విషయంలో తొలి రాజస్థాన్‌ ఆటగాడు..!