LSG vs CSK, IPL 2022: దంచికొట్టిన ఊతప్ప, దూబె.. లక్నో ముందు భారీ టార్గెట్..
LSG vs CSK. IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్యాటర్లు అదరగొట్టేశారు. సమష్ఠిగా రాణించి ప్రత్యర్థి ముందు 211 పరుగుల భారీ టార్గెట్‌ను ముందుంచారు.
LSG vs CSK. IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్యాటర్లు అదరగొట్టేశారు. సమష్ఠిగా రాణించి ప్రత్యర్థి ముందు 211 పరుగుల భారీ టార్గెట్‌ను ముందుంచారు. రాబిన్ ఊతప్ప (27 బంతుల్లో 50 8ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, శివమ్ దూబే ( 30 బంతుల్లో 49, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో అర్ధ సెంచరీని కోల్పోయాడు. మొయిన్ అలీ (35), అంబటి రాయుడు (27) కూడా ఓ మోస్తరుగా పరుగులు చేశారు. ఇక చివర్లో కెప్టెన్ రవీంద్ర జడేజా (17), ఎం.ఎస్.ధోని (16) వేగంగా పరుగులు సాధించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది చెన్నై. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ (24/2), అవేశ్ ఖాన్ (38/2), ఆండ్రూ టై (40/2) ఆకట్టుకున్నారు.
ఊతప్ప మెరుపు ఇన్నింగ్స్..
కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఒక్క పరుగుకే రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్ లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. మెరుపు ఇన్సింగ్స్ ఆడి ఐపీఎల్ కెరీర్‌లో 26వ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అతని ధాటికి పవర్ ప్లే ముగిసే నాటికి 73 పరుగులు సాధించింది. అందులో ఊతప్పవే 45 పరుగులు కావడం గమనార్హం. అయితే మరింత వేగంగా ఆడే ప్రయత్నంలో రవి బిష్ణోయ్ చేతికి చిక్కి పెవిలియన్ చేరుకున్నాడు. ఆతర్వాత శివమ్ దూబె కూడా బౌండరీలతో రెచ్చిపోయాడు. మొయిన్ అలీ సహాయంతో స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. రాయుడు కూడా రెచ్చిపోయాడు. ఇక ఆఖరులో రవీంద్ర జడేజా, ధోని కూడా వేగంగా రన్స్ చేయడంతో స్కోరు బోర్డు 200 పరుగులు దాటింది.
View this post on Instagram
Also Read:Viral Video: చిరుత పులి- బ్లాక్ పాంథర్ ఎదురుపడితే ఎలా ఉంటుందో తెలుసా..?
Puzzle Picture: ‘దమ్ముంటే నన్ను కనిపెట్టండి’.. డాగ్ విసిరిన సవాల్.. ఆన్సర్ చెప్పే సత్తా మీలో ఉందా?