AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Test Cricket History: క్రికెట్ చరిత్రలోనే దారుణమైన ఇన్నింగ్స్‌లు.. కనీసం 50 పరుగులు కూడా చేయలేని జట్లు ఇవే

Test Cricket History: టెస్టు క్రికెట్ అంటేనే బ్యాటర్ల సహనానికి, నైపుణ్యానికి అసలైన పరీక్ష. ఎంతటి దిగ్గజ జట్టయినా కష్టమైన పరిస్థితుల్లో తడబడితే ఘోరమైన పతనం తప్పదు. టెస్టు చరిత్రలో జట్టు మొత్తం కనీసం 50 పరుగులు కూడా చేయలేక పెవిలియన్‌కు క్యూ కట్టిన అత్యంత దారుణమైన సందర్భాలు కొన్ని ఉన్నాయి.

Test Cricket History: క్రికెట్ చరిత్రలోనే దారుణమైన ఇన్నింగ్స్‌లు.. కనీసం 50 పరుగులు కూడా చేయలేని జట్లు ఇవే
Test Cricket History
Rakesh
|

Updated on: Aug 22, 2026 | 11:47 AM

Share

Test Cricket History: టెస్ట్ క్రికెట్ అనేది బ్యాటర్ల సహనానికి అసలైన పరీక్షగా నిలుస్తుంది. మైదానంలో పరిస్థితులు బౌలర్లకు అనుకూలంగా మారినప్పుడు ఎంతటి దిగ్గజ బ్యాటింగ్ లైనప్ అయినా క్షణాల్లో కూలిపోతుంటుంది. సుదీర్ఘ టెస్ట్ చరిత్రలో కొన్ని జట్లు కనీసం 50 పరుగుల మార్కును కూడా అందుకోలేక పసికూనల్లా లొంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ అత్యల్ప స్కోర్ల జాబితాలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలవగా, వెస్టిండీస్, భారత్, దక్షిణాఫ్రికా వంటి దిగ్గజ జట్లు కూడా ఈ షాకింగ్ రికార్డును నమోదు చేశాయి.

న్యూజిలాండ్ పేరిట అత్యంత దారుణమైన రికార్డు

టెస్ట్ క్రికెట్ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన షాకింగ్ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉంది. మార్చి 25, 1955న ఆక్లాండ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 26 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు నిలబడలేకపోయారు. కేవలం 27 ఓవర్లలోనే ఇన్నింగ్స్ ముగిసిపోయింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అతి తక్కువ టీమ్ స్కోరు ఇదే కావడం గమనార్హం.

ఇది కూడా  చదవండి: IND vs AFG: ఒకే సమయంలో రెండు లీగ్‌లు.. అభిషేక్ శర్మ, శుభ్‎మన్ గిల్‌కు ఊహించని చిక్కులు

రెండో స్థానంలో వెస్టిండీస్

ఈ జాబితాలో వెస్టిండీస్ జట్టు రెండో స్థానంలో నిలిచింది. జూలై 2025లో కింగ్‌స్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా పేసర్ల దాడికి విండీస్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు. జట్టులోని ఏ ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోరును దాటలేకపోవడంతో ఈ దారుణమైన రికార్డు వెస్టిండీస్ ఖాతాలో చేరింది.

ఇది కూడా చదవండి: Mitchell Starc: వీడు మగాడ్రా బుజ్జి.. 42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్

జాబితాలో దక్షిణాఫ్రికా, టీమిండియా కూడా

దక్షిణాఫ్రికా జట్టు కూడా ఈ జాబితాలో పలుమార్లు కనిపిస్తుంది. 1896లో గెబేహాలో ఇంగ్లాండ్‌పై 30 పరుగులు, 1924లో బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌పై మళ్లీ 30 పరుగులకే ఆలౌట్ అయింది. ఇవే కాకుండా 1899లో కేప్‌టౌన్‌లో 35 రన్స్, 1932లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై 36 రన్స్ చేసింది. ఇక భారత జట్టు విషయానికి వస్తే.. 2020లో అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డే-నైట్ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది భారత టెస్ట్ చరిత్రలో అత్యల్ప స్కోరుగా నిలిచింది. అంతకుముందు 1974లో లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ 42 పరుగులకే కుప్పకూలింది.

 ఇది కూడా చదవండి: Love Affairs: ఆటగాడు మామూలు ఆటగాడు కాదు.. పాక్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌తో బాలీవుడ్ భామల అఫైర్లు

టెస్టుల్లో అత్యల్ప టీమ్ స్కోర్ల జాబితా

* న్యూజిలాండ్: 26 పరుగులు (వర్సెస్ ఇంగ్లాండ్, 1955)

* వెస్టిండీస్: 27 పరుగులు (వర్సెస్ ఆస్ట్రేలియా, 2025)

* దక్షిణాఫ్రికా: 30 పరుగులు (వర్సెస్ ఇంగ్లాండ్, 1896)

* దక్షిణాఫ్రికా: 30 పరుగులు (వర్సెస్ ఇంగ్లాండ్, 1924)

* దక్షిణాఫ్రికా: 35 పరుగులు (వర్సెస్ ఇంగ్లాండ్, 1899)

* దక్షిణాఫ్రికా: 36 పరుగులు (వర్సెస్ ఆస్ట్రేలియా, 1932)

* భారత్: 36 పరుగులు (వర్సెస్ ఆస్ట్రేలియా, 2020)

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us