
విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టును 106 పరుగుల తేడాతో ఓడించింది భారత్. తద్వారా హైదరాబాద్ లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. దీనితో పాటు ఈ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన స్థానం బాగా మెరుగైంది. ఇరు జట్ల మధ్య సిరీస్ ప్రారంభానికి ముందు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత్.. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ఓటమితో భారీగా నష్టపోయింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన రెండు నుంచి ఏకంగా ఐదో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు విశాఖపట్నం టెస్టు మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా.. మరోసారి ఐదో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ఎడిషన్ పాయింట్ల పట్టికలో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన భారత్ 3 మ్యాచ్‌లు గెలిచి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 1 మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొత్తం 38 పాయింట్లు సాధించిన భారత్ ఇప్పుడు 52.77 విజయ శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎప్పటిలాగే మొదటి స్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా జట్టు 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 3 ఓటములతో 66 పాయింట్లతో ఉంది.
మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఆడిన 2 మ్యాచ్‌ల్లో 1 విజయం, 1 ఓటమితో 12 పాయింట్లు సాధించింది. ఆఫ్రికన్ జట్టుతో సమానంగా మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లు వరుసగా 6, 7 స్థానాల్లో ఉండగా, ఇప్పుడు భారత్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ జట్టు ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండడం గమనార్హం. ఇంగ్లిష్ జట్టు ఇప్పటి వరకు 7 టెస్టు మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు, 3 ఓటములతో 21 పాయింట్లు సాధించింది.
INDIA secured second position in WTC points table after second test vs Eng.#INDvENG pic.twitter.com/LuGCaCA0DD
— Cricket24 : Community Professionals (@Cricket24_Game) February 5, 2024
వైజాగ్ మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 292 పరుగులకు ఆలౌటైంది. దీంతో 106 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. భారత్ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ బౌలర్ ఆర్ అశ్విన్ చెరో 3 వికెట్లు తీశారు. దీంతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 253 పరుగులకు కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 9 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు.
CASTLED! ⚡️⚡️
Jasprit Bumrah wraps things up in Vizag as #TeamIndia win the 2nd Test and level the series 1⃣-1⃣#TeamIndia | #INDvENG | @Jaspritbumrah93 | @IDFCFIRSTBank pic.twitter.com/KHcIvhMGtD
— BCCI (@BCCI) February 5, 2024
A splendid bowling display on Day 4 powers #TeamIndia to a 106-run win 🙌
Scorecard ▶️ https://t.co/X85JZGt0EV#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/P9EXiY8lVP
— BCCI (@BCCI) February 5, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..