అసలు లాస్ట్ ఓవర్‌లో ఏం జరిగిందంటే..!

ఇంగ్లండ్‌లోని లార్డ్స్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో వీక్షకులకు నిజంగా కిక్ ఇచ్చింది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో చివరి ఓవర్ ఎలా ఉండాలో నిజంగా అలాగే అనిపించింది. చివరి ఓవర్‌లో ఇంగ్లండ్‌కు 15 పరుగులు అవసరం అయ్యాయి. అయితే ఈ సమయంలో న్యూజిలాండ్ తరఫున బౌలర్ బోల్ట్ రంగంలోకి దిగారు. తొలి రెండు బంతులు పరుగులు ఏమీ ఇవ్వలేదు. అయితే మూడో బంతిని బెన్ స్టోక్స్ సిక్స్‌గా మలిచాడు. అయితే నాలుగో […]

అసలు లాస్ట్ ఓవర్‌లో ఏం జరిగిందంటే..!
Follow us

| Edited By:

Updated on: Jul 15, 2019 | 5:13 AM

ఇంగ్లండ్‌లోని లార్డ్స్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో వీక్షకులకు నిజంగా కిక్ ఇచ్చింది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో చివరి ఓవర్ ఎలా ఉండాలో నిజంగా అలాగే అనిపించింది. చివరి ఓవర్‌లో ఇంగ్లండ్‌కు 15 పరుగులు అవసరం అయ్యాయి. అయితే ఈ సమయంలో న్యూజిలాండ్ తరఫున బౌలర్ బోల్ట్ రంగంలోకి దిగారు.

తొలి రెండు బంతులు పరుగులు ఏమీ ఇవ్వలేదు. అయితే మూడో బంతిని బెన్ స్టోక్స్ సిక్స్‌గా మలిచాడు. అయితే నాలుగో బంతికి కూడా ఆరు పరుగులు వచ్చాయి. అయితే అవి సిక్స్ కొట్టడం ద్వారా కాదు. స్టోక్స్ బంతిని కొట్టిన తర్వాత రెండు పరుగులు చేశాడు. అయితే బాల్‌ను త్రో వేసే క్రమంలో రన్నింగ్ చేస్తున్న బ్యాట్స్‌మెన్ బ్యాట్‌కు తగలి బౌండరీకి వెళ్లింది. ఇక ఐదో బాల్‌ కు రెండు పరుగులు రాగా.. చివరి బంతికి 1 పరుగు వచ్చింది.  రెండు పరుగులు తీసే సమయంలో ఓ వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చింది. దీంతో ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మ్యాచ్ “టై” గా ముగిసింది. ఒకవేళ.. చివరి ఓవర్లో అదనపు పరుగులు రాకుంటే.. న్యూజీలాండ్‌ను విజయం వరించేది. ఇక చివర్లో రన్ అవుట్ కాకుండా రెండు పరుగులు చేస్తే.. ఇంగ్లాండ్ విజేతగా నిలిచేది. టై గా ముగిసే సరికి.. సూపర్ ఓవర్‌ ఆడాల్సి వచ్చింది.

అయితే సూపర్ ఓవర్లో ఇంగ్లాండ్ 15 పరుగులు చేసింది. ఇటు న్యూజిలాండ్ కూడా 15 పరుగులు చేసింది. కానీ, ఐసీసీ నిబంధనల ప్రకారం అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించింది.