సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్.. విశ్వ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్
ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఫలితం తేలింది. సూపర్ ఓవర్లో ఇంగ్లాండ్ 15 పరుగులు చేయగా.. కివీస్ కూడా 15 పరుగులు చేసింది. అయితే దీంట్లో ఇంగ్లాండ్ ఎక్కువ బౌండరీలు బాదడంతో.. ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది. న్యూజిలాండ్ విధించిన లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో ప్రపంచకప్ చరిత్రలోనే […]
ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఫలితం తేలింది. సూపర్ ఓవర్లో ఇంగ్లాండ్ 15 పరుగులు చేయగా.. కివీస్ కూడా 15 పరుగులు చేసింది. అయితే దీంట్లో ఇంగ్లాండ్ ఎక్కువ బౌండరీలు బాదడంతో.. ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది.
న్యూజిలాండ్ విధించిన లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి సూపర్ ఓవర్‌తో ఫలితం తేలింది.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌ను ఇంగ్లాండ్ బౌలర్లు తొలినుంచే కట్టడి చేశారు. ముఖ్యంగా క్రిస్‌వోక్స్, లియామ్ ఫ్లంకెట్‌లు చెరి మూడు వికెట్లతో విరుచుకుపడ్డారు. కివీస్ ఆటగాళ్లలో హెన్నీ నికోలస్ 55, టామ్ లాథమ్ 47 పరుగులతో రాణించడంతో 8 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 241 పరుగులు చేసింది.
టార్గెట్ చేధించే క్రమంలో ఇంగ్లాండ్ తొలుత తడబడినప్పటికీ.. బెన్ స్టోక్స్ విరోచిత బ్యాటింగ్‌తో మ్యాచ్ టైగా మారింది. 50 ఓవర్లలో ఇంగ్లాండ్ 241 పరుగులు చేసి ఆలౌంట్ అయ్యింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో బట్లర్ 59 పరుగులు చేయగా.. బెన్ స్టోక్స్ 82 పరుగులతో రాణించారు. కివీస్ బౌలర్లలో ఫెరుగ్‌సన్, జేమ్స్ నిషమ్ చెరి మూడు వికెట్లు దక్కించుకున్నారు.
Thrill. Excitement. Jubilation. #EoinMorgan and his team are world champions! ? #CWC19FINAL | #WeAreEngland | #CWC19 pic.twitter.com/8qbv446AEm
— Cricket World Cup (@cricketworldcup) July 14, 2019