IPL 2021, KKR vs RR Highlights: రాజస్థాన్ ఘోర పరాజయం.. 86 పరుగులతో కోల్‌కతా ఘన విజయం
IPL 2021, KKR vs RR Highlights: 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ టీం కేవలం 16.1 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కోల్‌కతా టీం 86 పరుగుల తేడాతో విజయం సాధించింది.
IPL 2021: ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండవ మ్యాచ్ షార్జాలో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం అన్ని విభాగాల్లో ఆకట్టుకుని ఘన విజయం సాధించి ప్లేఆఫ్‌లో నిలిచింది. 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ టీం కేవలం 16.1 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు టాస్ ఓడిన కోల్‌కతా టీం నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండవ మ్యాచ్ షార్జాలో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు ముఖ్యమైనది. రాజస్థాన్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. మరోవైపు, రాజస్థాన్‌ను ఓడించడం ద్వారా కోల్‌కతా జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోవడం సులభం కానుంది.
ఐపీఎల్ 2021 లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. కేకేఆర్ నాల్గవ స్థానానికి ఉన్న పోటీదారులలో కీలకంగా ఉంది. 13 మ్యాచ్‌లు ఆడిన తర్వాత 12 పాయింట్లను కలిగి ఉంది. అయితే రన్‌రేట్‌తో ప్లేఆఫ్‌లో ముందుంది.
ఐపీఎల్ 2021 లో రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్ టికెట్ కోసం వేచి చూస్తోంది. 13 మ్యాచ్‌ల తర్వాత ఈ జట్టు కేవలం 10 పాయింట్లను సాధించింది. రాజస్థాన్ జట్టుకు రన్‌రేట్ కూడా ప్రతికూలంగా మారింది. పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలిచింది.
LIVE Cricket Score & Updates
-
కోల్‌కతా ఘన విజయం
ఈ మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం అన్ని విభాగాల్లో ఆకట్టుకుని ఘన విజయం సాధించి ప్లేఆఫ్‌లో నిలిచింది. 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ టీం కేవలం 16.1 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ అయింది.
-
15 ఓవర్లకు కోల్‌కోతా స్కోర్ 83/8
15 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం 8 వికెట్లు నష్టపోయి 83 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ తెవాటియా 43, చేతన్ సకారియా 1 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
-
ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
గ్లెన్ పిలిప్స్ (8) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. శివం మావి బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.
-
నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
అనుజ్ రావత్ (0) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
-
మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
లివింగ్‌స్టోన్ (6) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో త్రిఫాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
-
-
రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
శాంసన్ (1) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. శివం మావి బౌలింగ్‌లో మోర్గాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
-
తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్
జైస్వాల్ రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. షకిబ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.
-
రాజస్థాన్ లక్ష్యం 172
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం ముందు 172 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది.
-
నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
త్రిపాఠి (21 పరుగులు, 14 బంతులు, 3 ఫోర్లు) రూపంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. చేతన్ సకారియా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.
-
మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
గిల్ (56 పరుగులు, 44 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ మూడో వికెట్‌ను కోల్పోయింది. క్రిస్ మోరిస్ ఓవర్లో జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
13 ఓవర్లకు కోల్‌కోతా స్కోర్ 106/2
13 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం 2 వికెట్లు నష్టపోయి 106 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్ 44, త్రిపాఠి 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
నితీష్ రానా (12 పరుగులు, 5 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) రూపంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండో వికెట్‌ను కోల్పోయింది. గ్లెన్ పిలిప్స్ వేసిన 11.5వ లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా
వెంకటేష్ అయ్యర్ (38 పరుగులు, 35 బతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి వికెట్‌ను కోల్పోయింది. రాహుల్ తెవాటియా వేసిన 10.5వ బంతికి బౌల్డయ్యాడు. 10.5 ఓవర్లకు 79/1 గా ఉంది.
-
9 ఓవర్లకు కోల్‌కోతా స్కోర్ 55/0
9 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం వికెట్ నష్టకోకుండా 55 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్ 24, శుభ్మన్ గిల్ 26 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
6 ఓవర్లకు కోల్‌కోతా స్కోర్ 34/0
6 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం వికెట్ నష్టకోకుండా 34 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్ 13, శుభ్మన్ గిల్ 18 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
3 ఓవర్లకు కోల్‌కోతా స్కోర్ 17/0
3 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం వికెట్ నష్టకోకుండా 17 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్ 7, శుభ్మన్ గిల్ 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
మొదలైన కోల్‌కతా బ్యాటింగ్
టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం తరపున ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్ బరిలోకి దిగారు.
-
ప్లేయింగ్ ఎలెవన్
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, లియామ్ లివింగ్‌స్టోన్, సంజు శాంసన్ (కెప్టెన్, కీపర్), గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, శివమ్ దూబే, క్రిస్ మోరిస్, రాహుల్ తెవాటియా, జయదేవ్ ఉనద్కట్, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రహమాన్
కోల్‌కతా నైట్ రైడర్స్: శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (మోర్గాన్), దినేష్ కార్తీక్ (కీపర్), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చాకరవర్తి
-
టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
కీలకమైన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం బ్యాటింగ్ చేయనుంది.
-
కేకేఆర్ టీంకి శుభవార్త
కేకేఆర్ టీంకి శుభవార్త. గాయపడిన ఇద్దరు ఆటగాళ్లు కోలుకుని తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆండ్రీ రస్సెల్, లాకీ ఫెర్గూసన్‌లు ఫిట్‌గా ఉన్నారు. ఈ ఇద్దరు తిరిగి వస్తే, టిమ్ సౌతీ, షకీబ్ అల్ హసన్ మ్యాచ్ నుంచి తప్పుకోనున్నారు.
-
KKR vs RR: హెడ్ టూ హెడ్
ఐపీఎల్ పిచ్‌లో కోల్‌కతా వర్సెస్ రాజస్థాన్ ఈ రోజు 25 వ సారి తలపడనున్నాయి. ఇంతకు ముందు జరిగిన 24 ఎన్‌కౌంటర్లలో కేకేఆర్ 12 మ్యాచ్‌లు గెలిస్తే, ఆర్‌ఆర్ టీం 11 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య 1 మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది.
Published On - Oct 07,2021 6:57 PM