PM Modi- Team India: ప్రపంచకప్‌ను ముట్టుకోని ప్రధాని మోడీ.. కారణమేంటో తెలుసా?

|

Jul 04, 2024 | 4:57 PM

టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లు గురువారం (జూన్ 4) ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. బార్బడోస్ నుంచి గురువారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు న్యూఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి చేరుకున్నారు. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జైషా కూడా వీరి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లతో ప్రధాని మోదీ ఫొటోలు దిగారు.

PM Modi- Team India: ప్రపంచకప్‌ను ముట్టుకోని ప్రధాని మోడీ.. కారణమేంటో తెలుసా?
PM Modi, Team India
Follow us on

టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లు గురువారం (జూన్ 4) ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. బార్బడోస్ నుంచి గురువారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు న్యూఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి చేరుకున్నారు. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జైషా కూడా వీరి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లతో ప్రధాని మోదీ ఫొటోలు దిగారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొదట ఆటగాళ్లందరూఊ కలిసి మోడీతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఆ తర్వాత ఆటగాళ్లందరూ విడివిడిగా తమ కుటుంబ సభ్యులతో కలిసి మోడీతో ఫొటోలు దిగారు. వీటికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐతో పాటు పీఎం మోడీ కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. ప్రధాని మోడీ ప్రపంచ కప్ ను ముట్టుకోలేదు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ ను పట్టుకుంటే.. మోడీ మాత్రం వారి చేతులనే పట్టుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

వీటిని చూసిన నెటిజన్లు ప్రధాని ఎందుకు ప్రపంచ కప్ ను మట్టుకోలేదు? అన్న దానిపై ఆరా తీస్తున్నారు. అయితే ఇందుకు ప్రత్యేక కారణం ఏమీ లేదని, భారత ఆటగాళ్లు, కోచ్ కష్టపడి ప్రపంచ కప్ సాధించారు. కాబట్టి.. ఆ ట్రోఫీని వాళ్లు పట్టుకుంటేనే సరైనదని మోడీ భావించి ఉంటారు. అందుకే ప్రపంచకప్ ట్రోఫీని ముట్టుకోలేదుని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

టీమిండియా ప్లేయర్లతో ప్రధాని మోడీ..

ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు ముంబై బయల్దేరి వెళ్లారు. మరికాసేపట్లో టీమ్ ఇండియా విజయ యాత్ర ప్రారంభం కానుంది. ఇందుకోసం టీం ఇండియా ఆటగాళ్లు ఢిల్లీ నుంచి ముంబైకి చేరుకున్నారు. ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని ఎయిర్ ఇండియా భవనం నుంచి ప్రారంభమై వాంఖడే స్టేడియంలో ముగుస్తుంది. దీని తర్వాత వాంఖడే స్టేడియంలో టీమిండియా విజయోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగానే భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల బహుమతిని అందజేయనుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..