AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 జట్లు, 15 మ్యాచ్‌లు.. 19 రోజులపాటు ఫ్యాన్స్‌కు పండగే.. ఛాంపియన్స్ ట్రోఫీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీం ఏదో తెలుసా?

Champions Trophy Match Schedule: ఛాంపియన్స్ ట్రోఫీ 8 సంవత్సరాల తర్వాత తిరిగి రాబోతోంది. 8 జట్ల మధ్య జరిగే ఈ టోర్నమెంట్ నేటినుంచి అంటే ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్ 19 రోజుల పాటు కొనసాగుతుంది. ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదరుచూసేది భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ కోసమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్‌తోపాటు మరో 15 ఉత్కంఠ మ్యాచ్‌లను చూసే అవకాశం ఉంది.

8 జట్లు, 15 మ్యాచ్‌లు.. 19 రోజులపాటు ఫ్యాన్స్‌కు పండగే.. ఛాంపియన్స్ ట్రోఫీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీం ఏదో తెలుసా?
Champions Trophy 2025 Prize Money
Venkata Chari
|

Updated on: Feb 19, 2025 | 10:11 AM

Share

Champions Trophy Match Schedule: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్ 8 సంవత్సరాల తర్వాత తిరిగి రాబోతోంది. ఈ టోర్నమెంట్ చివరిసారిగా 2017 లో జరిగింది. ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నమెంట్ టైటిల్‌ను పాకిస్తాన్ గెలుచుకుంది. ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాల తర్వాత, ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ ఆతిథ్యంలో జరగనుంది. కానీ, ఈసారి ఈ టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతుంది. నిజానికి, బీసీసీఐ టీం ఇండియాను పాకిస్థాన్‌కు పంపలేదు. ఇటువంటి పరిస్థితిలో టీం ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. ఇది కాకుండా, మిగిలిన జట్ల మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో ఆడనున్నాయి.

ఈ 8 జట్ల మధ్య పోటీ..

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో 8 జట్లు ఆడతాయి. వీటిలో భారతదేశం, పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఎలో భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. కాగా, గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో అన్ని జట్లు తమ గ్రూప్‌లోని జట్లతో ఒకసారి తలపడతాయి. ఆ తర్వాత రెండు గ్రూపుల నుంచి తలో 2 జట్లు సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

మ్యాచ్‌లు ఎక్కడ జరగనున్నాయి?

2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో, మొత్తం 4 స్టేడియాలలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో పాకిస్తాన్ నుంచి 3 స్టేడియంలు, దుబాయ్ నుంచి 1 స్టేడియాన్ని ఎంపిక చేశారు. పాకిస్తాన్‌లో, కరాచీలోని నేషనల్ స్టేడియం, లాహోర్‌లోని గడాఫీ స్టేడియం, రావల్పిండిలోని రావల్పిండి క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి. దుబాయ్‌లో, టీం ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడుతుంది. ఈ టోర్నమెంట్‌లో అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి. టాస్ మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది.

భారతదేశంలో మ్యాచ్‌లను ఎక్కడ, ఎలా చూడవచ్చు?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడే అన్ని మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్18 ఛానెల్‌లలో వివిధ భాషలలో టెలివిజన్‌లో ప్రసారం చేస్తారు. అలాగే ఇది జియోస్టార్ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో, అభిమానులు ఈ మ్యాచ్‌ను ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, హర్యాన్వి, బెంగాలీ, భోజ్‌పురి, తమిళం, తెలుగు, కన్నడ భాషలలో వినగలరు.

ఈ స్టార్ ఆటగాళ్ళు టోర్నమెంట్‌లో భాగం కావడం లేదు..

చాలా మంది పెద్ద ఆటగాళ్ళు 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం కనిపించదు. వీరిలో పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, జస్‌ప్రీత్ బుమ్రా, అన్రిచ్ నార్కియా, జెరాల్డ్ కోట్జీ, సామ్ అయూబ్, జాకబ్ బెథెల్, అల్లా గజన్‌ఫర్, బెన్ సియర్స్, లోకీ ఫెర్గూసన్ ఉన్నారు. మిచెల్ స్టార్క్ తన వ్యక్తిగత కారణాల వల్ల ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటం లేదు. వీరు కాకుండా, మిగతా ఆటగాళ్లందరూ గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.

టీం ఇండియా మ్యాచ్‌ల షెడ్యూల్..

ఫిబ్రవరి 20 నుంచి ఈ టోర్నమెంట్‌లో టీం ఇండియా తన ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఆ తర్వాత టీం ఇండియా తన రెండో మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది. ఆ తర్వాత, గ్రూప్‌లో తన చివరి మ్యాచ్‌లో, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఆ తరువాత సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.

టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన జట్టు..

ఈ టోర్నమెంట్ చరిత్రలో టీం ఇండియా అత్యంత విజయవంతమైన జట్టుగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు భారత్ 29 మ్యాచ్‌లు ఆడి 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 8 మ్యాచ్‌ల్లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అలాగే, మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇది కాకుండా, భారత జట్టు రెండుసార్లు టైటిల్ గెలుచుకుంది. 2002 సంవత్సరంలో, ఈ టోర్నమెంట్‌లో టీం ఇండియా, శ్రీలంక సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. కాగా, 2013 సంవత్సరంలో, టీం ఇండియా ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది.

టోర్నమెంట్ కోసం అన్ని జట్లు ఇవే..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.

బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), తౌహీద్ హృదయ్, సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహదీ హసన్ మీరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్, నహిద్ రాణా.

న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, విలియం ఓ’రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, జాకబ్ డఫీ.

పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజామ్, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ ఆఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరిస్ రౌఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షహీన్ షా అఫ్రిది.

అఫ్గానిస్తాన్: హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెదికుల్లా అటల్, రహ్మత్ షా, ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నయీబ్, అజ్మతుల్లా ఉమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నాంగ్యాల్ ఖరోటి, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ, ఫరీద్ మాలిక్, నవీద్ జద్రాన్.

ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.

ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, బెన్ ద్వార్షిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా.

దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగి న్గిడి, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసి, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, కార్బిన్ బాష్.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్..

మ్యాచ్‌లు- తేదీ, జట్లు..

1- ఫిబ్రవరి 19, పాకిస్తాన్ vs న్యూజిలాండ్

2- ఫిబ్రవరి 20, దుబాయ్‌లో బంగ్లాదేశ్ vs ఇండియా

3- ఫిబ్రవరి 21, ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా

4- ఫిబ్రవరి 22, ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్

ఫిబ్రవరి 5- 23, పాకిస్తాన్ vs భారతదేశం

ఫిబ్రవరి 6- 24, బంగ్లాదేశ్ v న్యూజిలాండ్

ఫిబ్రవరి 7- 25, ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా

8- ఫిబ్రవరి 26, ఆఫ్ఘనిస్తాన్ v ఇంగ్లాండ్

ఫిబ్రవరి 9- 27, పాకిస్తాన్ vs బంగ్లాదేశ్

ఫిబ్రవరి 10- 28, ఆఫ్ఘనిస్తాన్ v ఆస్ట్రేలియా

11- మార్చి 1, దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్

12- మార్చి 2, న్యూజిలాండ్ v ఇండియా

SF1 – మార్చి 4, సెమీఫైనల్ 1

SF2 – మార్చి 5, సెమీఫైనల్ 2

ఫైనల్ – మార్చి 9, TBD

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..