
IND vs ENG 3rd Test: రాజ్‌కోట్‌లో ఫిబ్రవరి 15 నుంచి భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, స్వ్కాడ్‌లో ఎంపికైన సీనియన్ ప్లేయర్ కేఎల్ రాహుల్, జడేజాలు మాత్రం, వారి ఫిట్‌నెస్ ఆధారంగా మ్యాచ్ ఆడతారంటూ బీసీసీఐ ప్రకటించింది. కాగా, ఇప్పుడు భారత జట్టుకు 3వ టెస్ట్ మ్యాచ్‌కు ముందే భారీ షాక్ తగిలింది. కేఎల్ రాహుల్ జట్టు నుంచి తప్పించినట్లు బీసీసీఐ నుంచి సమాచారం అందుతోంది. ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించిన బీసీసీఐ మెడికల్ టీం.. కేఎల్ రాహుల్‌ని అనర్హుడని భావించినట్లు నివేదికలో తేలింది. దీంతో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు కేఎల్ రాహుల్ గైర్హాజరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చివరి మూడు టెస్ట్ మ్యాచ్‌లకు ఎంపికైనప్పటికీ, రాహుల్ ఇక ఈ సిరీస్‌లో ఆడడని పేర్కొంది.
తాజా పరిణామం ప్రకారం, గురువారం నుంచి రాజ్‌కోట్‌లో జరగనున్న రాబోయే టెస్ట్‌కు భారత ప్రీమియర్ బ్యాటర్ తప్పుకున్నట్లైంది. కేఎల్ రాహుల్ ప్లేస్‌లో దేవదత్ పడిక్కల్ టెస్ట్ మ్యాచ్‌కి ఎంపికైనట్లు సమాచారం అందుతోంది.
సెలక్టెర్లు కేఎల్ రాహుల్ లభ్యతపై నిర్ణయం తీసుకునే ముందు అతని పరిస్థితిని మరో వారం పాటు పర్యవేక్షిస్తారంట. విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్‌లు ఇప్పటికే ఔట్ కావడంతో భారత లైనప్‌ను గాయాలతో ఇబ్బందులు పడుతోంది. కేఎల్ రాహుల్ స్థానంలో ఎంపికైన దేవదత్ పడిక్కల్.. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో ఆశాజనక ఫామ్‌ను ప్రదర్శిస్తున్నాడు. దీంతో భారత బ్యాటింగ్ లైనప్‌కు మరింత లోతును జోడించే అవకాశం ఉంది.
రంజీ ట్రోఫీలో పంజాబ్‌పై 193, గోవాపై 103 పరుగులతో పడిక్కల్ ఆకట్టుకున్నాడు. అలాగే, ఇంగ్లాండ్ లయన్స్‌తో ఇండియా ఏ ఎన్‌కౌంటర్‌లలో 105, 65, 21 పరుగులు చేశాడు. పడిక్కల్ నిలకడ భారత జట్టు బ్యాటింగ్‌కు బలాన్ని అందిస్తోంది.
KL Rahul ruled out of the 3rd Test against England. [Express Sports]
– Devdutt Padikkal replaces KL Rahul in the team. pic.twitter.com/bLfReAnVj5
— Johns. (@CricCrazyJohns) February 12, 2024
కుడి క్వాడ్రిసెప్స్ గాయం కారణంగా కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యాడు. ఇంకా పూర్తిగా ఫిట్‌గా లేనప్పటికీ, కీలకమైన మూడో టెస్టు ఆడేందుకు జడేజాకు అనుమతి లభించింది. రాహుల్ తిరిగి వెళ్లే విషయంలో మరో వారం రోజుల పాటు పర్యవేక్షించాలని వైద్య బృందం యోచిస్తోంది. అతను రెండో టెస్టుకు దూరమయ్యాడు. సిరీస్‌కి రాహుల్ లభ్యతపై అనిశ్చితి కొనసాగుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..