కేఎల్ రాహుల్‌కి అపెండిసైటిస్..! ఆపరేషన్ కోసం ఆస్పత్రికి.. మరి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఎవరో తెలుసా..?

|

May 02, 2021 | 7:02 PM

IPL 2021 : ఐపిఎల్ 2021లో పంజాబ్ కింగ్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ కెఎల్ రాహుల్ అపెండిసైటిస్ తో ఆస్పత్రిలో

కేఎల్ రాహుల్‌కి అపెండిసైటిస్..! ఆపరేషన్ కోసం ఆస్పత్రికి.. మరి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఎవరో తెలుసా..?
Kl Rahul
Follow us on

IPL 2021 : ఐపిఎల్ 2021లో పంజాబ్ కింగ్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ కెఎల్ రాహుల్ అపెండిసైటిస్ తో ఆస్పత్రిలో చేరికయ్యాడు దీంతో తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండలేకపోతున్నాడు. దీంతో ఇప్పుడు జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆదివారం పంజాబ్ జట్టు ట్విట్టర్ వేదికగా ఈ వార్తను ప్రకటించింది. కెఎల్ రాహుల్ గత రాత్రి కడుపు నొప్పితో బాధపడుతుండటంతో మందులు ఇచ్చారు. అయినా నొప్పి తగ్గక ఎక్కువ కావడంతో తదుపరి పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అతనికి తీవ్రమైన అపెండిసైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది శస్త్రచికిత్స ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుంది.

రాహుల్ ప్రస్తుతం టోర్నమెంట్‌లో 66.20 సగటుతో 331 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ద సెంచరీలు ఉన్నాయి. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. రాహుల్ లేకపోవడంతో జట్టు కెప్టెన్ ఎవరు అవుతారో ఫ్రాంచైజ్ ఇంకా ప్రకటించలేదు. క్రిస్ గేల్ లేదా మయాంక్ అగర్వాల్ అవ్వొచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం ఏడు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) తో జరిగిన మునుపటి మ్యాచ్‌లో పిబికెఎస్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ 57 బంతుల్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో సహా అజేయంగా 91 పరుగులు చేశాడు. టోర్నమెంట్‌లో ఇప్పటికే 16 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.

West Bengal, Assam Election Results 2021 LIVE: నందిగ్రామ్‌లో అనూహ్య మలుపు.. ఓడిపోయిన మమతా బెనర్జీ.. అస్సాంలో ఎన్డీఏ

Sudarshan Chakra: భద్రాచలం రామాయలంపై ఉన్న సుదర్శన చక్రం మహిమ గురించి మీకు తెలుసా..!

India Oxygen Crisis: ఆక్సిజన్ కోసం యుద్ధ నౌకలు.. సముద్ర సేతు- 2 స్పెష‌ల్ ఆప‌రేష‌న్

Vaccine for 18 above: మూడో దశ టీకా దేశంలో ఎక్కడెక్కడ మొదలైంది..ఏ రాష్ట్రాలు 18 ఏళ్లు దాటిన వారికి టీకా ఇచ్చాయి..వివరాలు