IPL 2024: ‘ నన్ను ఎవ్వరూ నమ్మలేదు.. బాధను అర్థం చేసుకోలేకపోయారు’.. ఐపీఎల్ ఫైనల్ ముందు బాంబ్ పేల్చిన శ్రేయస్

|

May 26, 2024 | 6:23 PM

నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారిలో అయ్యర్ కూడా ఒకడు. 11 మ్యాచ్‌ల్లో మొత్తం 530 పరుగులు చేశాడు. అయితే ప్రపంచకప్ తర్వాత శ్రేయాస్ అయ్యర్‌కు కష్టకాలం దాపరించింది. అతనికి వెన్నునొప్పి మొదలైంది. దీంతో టెస్టు టోర్నీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. రంజీ ట్రోఫీలో మ్యాచ్ ఆడకపోవడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అతనిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది

IPL 2024:  నన్ను ఎవ్వరూ నమ్మలేదు.. బాధను అర్థం చేసుకోలేకపోయారు.. ఐపీఎల్ ఫైనల్ ముందు బాంబ్ పేల్చిన శ్రేయస్
Shreyas Iyer
Follow us on

ప్రపంచకప్ 2023లో భారత క్రికెట్ జట్టు ఫైనల్ రౌండ్‌కు చేరుకోవడంలో శ్రేయాస్ అయ్యర్ పాత్ర అత్యంత కీలకమైనది. విరాట్‌ కోహ్లి తర్వాత రోహిత్‌ శర్మ, శ్రేయాస్‌ అయ్యర్‌ అత్యధిక పరుగులు సాధించాడీ మిడిలార్డర్ బ్యాటర్. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారిలో అయ్యర్ కూడా ఒకడు. 11 మ్యాచ్‌ల్లో మొత్తం 530 పరుగులు చేశాడు. అయితే ప్రపంచకప్ తర్వాత శ్రేయాస్ అయ్యర్‌కు కష్టకాలం దాపరించింది. అతనికి వెన్నునొప్పి మొదలైంది. దీంతో టెస్టు టోర్నీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. రంజీ ట్రోఫీలో మ్యాచ్ ఆడకపోవడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అతనిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. IPL 2024 ఫైనల్ ప్రారంభానికి ముందు శ్రేయాస్ అయ్యర్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా ఉన్న అయ్యర్‌ టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే సమయంలో సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించండంపై అయ్యర్ స్పందించాడు.

‘నాకు చాలా కాలంగా వెన్నునొప్పి ఉంది. కానీ నా వెన్ను గాయాన్ని ఎవ్వరూ నమ్మలేదు. ప్రపంచకప్ తర్వాత నేను చాలా ఇబ్బంది పడ్డాను. కానీ నా ఆవేదనను ఎవరూ నమ్మలేదు. కనీసం అర్థం చేసుకోలేకపోయారు. నా బాధ మొదలై ఐపీఎల్ దగ్గర పడుతోంది. అందుకే ఐపీఎల్‌పై దృష్టి పెట్టాను. ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాను. మేము రూపొందించిన వ్యూహం విజయవంతమైంది. బ్యాటర్లు రెడ్‌ బాల్‌ నుంచి వైట్‌ బాల్‌కి రావడం కష్టం. కానీ మేం త్వరగా అలవాటు పడ్డాం’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

భారతదేశం తరపున మూడు ఫార్మాట్లలో కలిపి 124 మ్యాచ్‌లలో 4000 కంటే ఎక్కువ పరుగులు చేసిన శ్రేయస్, గతం గురించి ఆలోచించకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం మంచిదని చెప్పాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్‌తో కలిసి శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

 

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు:

శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శ్రీకర్ భరత్, మనీష్ పాండే, రహమానుల్లా గుర్బాజ్, రమణదీప్ సింగ్, నితీష్ రాణా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రింకూ సింగ్, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వైభవ్ అరోరో చమీ హర్షిత్ రాణా, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, సాకిబ్ హుస్సేన్, అంగ్క్రిష్ రఘువంశీ, అల్లా ఘజన్‌ఫర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..