హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
ఐపీఎల్‌లో భాగంగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అలవోకగా విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు పై ఢిల్లీ క్యాపిటల్స్ 39 పరుగుల తేడాతో గెలిచింది. ఢిల్లీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 116 పరుగులకే కుప్పకూలింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటింగ్‌లో శ్రేయస్ 45, పంత్ 23 పరుగులు చేశారు. […]

ఐపీఎల్‌లో భాగంగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అలవోకగా విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు పై ఢిల్లీ క్యాపిటల్స్ 39 పరుగుల తేడాతో గెలిచింది. ఢిల్లీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 116 పరుగులకే కుప్పకూలింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటింగ్‌లో శ్రేయస్ 45, పంత్ 23 పరుగులు చేశారు.
అనంతరం లక్ష్యచేధన కోసం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు వార్నర్ 51, బెయిర్‌స్టో 41 పరుగులు చేయగా..మిగతా మిడిలార్డర్ ఆటగాళ్లు చేతులేత్తేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 116 పరుగులకే ఆలౌట్ అయింది.