AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy: ఆఫ్ఘాన్‌తో ఓటమి ఎఫెక్ట్.. కట్‌చేస్తే.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న స్టార్ ప్లేయర్..

Jos Buttler Steps Down as England White Ball Captain: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి గ్రూప్ దశలో నిష్క్రమించిన తర్వాత, ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్ శుక్రవారం బిగ్ షాకిచ్చాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియా చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిన ఇంగ్లాండ్, బుధవారం పాకిస్తాన్‌లోని లాహోర్‌లో టోర్నమెంట్‌లో అరంగేట్రం చేసిన ఆఫ్ఘనిస్తాన్‌పై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Champions Trophy: ఆఫ్ఘాన్‌తో ఓటమి ఎఫెక్ట్.. కట్‌చేస్తే.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న స్టార్ ప్లేయర్..
Jos Buttler
Venkata Chari
|

Updated on: Feb 28, 2025 | 9:02 PM

Share

Jos Buttler Steps Down as England White Ball Captain: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ వన్డే, టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇంగ్లాండ్ జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఆ జట్టు గ్రూప్ దశలో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. కొంతకాలంగా బట్లర్ కెప్టెన్సీలో జట్టు బాగా రాణించలేకపోయింది. ఆ జట్టు భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది.

ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్సీ నుంచి జోస్ బట్లర్ తప్పుకున్నాడు. అతను వైట్ బాల్ ఫార్మాట్ పదవికి రాజీనామా చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగే గ్రూప్ లీగ్ దశ మ్యాచ్‌లో చివరిసారిగా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తానని బట్లర్ చెప్పుకొచ్చాడు. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ శనివారం కరాచీ మైదానంలో జరుగుతుంది.

గత వారం, ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ తరువాత, ఆ జట్టు లాహోర్ మైదానంలో ఆఫ్ఘనిస్తాన్‌పై కూడా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు స్కోరు బోర్డుపై 325 పరుగులు చేసింది. ఇందులో ఇబ్రహీం జద్రాన్ 177 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్‌లో ఓడిపోయింది. అంతకుముందు ఆ జట్టు భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 3-0తో, టీ20లో 4-1తో ఓడిపోయింది. ఇయాన్ మోర్గాన్ రిటైర్ అయినప్పుడు బట్లర్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..